Shruti Hassan Talks About Her Marriage With Industry Person

Shruti hassan love marriage news film industry person

Shruti Hassan news, Shruti Hassan updates, Shruti Hassan gallery, Shruti Hassan marriage, Shruti Hassan love marriage, Shruti Hassan affairs, Shruti Hassan love affairs, Shruti Hassan scandals, Shruti Hassan photo shoot

Shruti Hassan Love Marriage News Film Industry Person : Shruti Hassan Talks About Her Marriage That She will marry with only the person who belongs to film industry who have some knowlegde about this field.

చిత్రపరిశ్రమకి చెందిన వరుడితో శృతి పెళ్లి?

Posted: 04/25/2015 03:20 PM IST
Shruti hassan love marriage news film industry person

అమ్మాయిలు ఓ వయస్సుకు వచ్చిన తర్వాత ‘పెళ్లెప్పుడు?’ అంటూ తారసపడటం సర్వసాధారణమే! అలాగే.. హీరోయిన్లను కూడా ఏదైనా సందర్భంలో మీడియా ప్రశ్నించడం సహజం! చాలామంది హీరోయిన్లు తమ పెళ్లి విషయాలను వ్యక్తపరచడంలో విముఖత తెలిపినప్పటికీ.. మీడియా వారిని తరచూ ప్రశ్నిస్తూనే వుంటుంది. ఎందుకంటే.. ఈ విషయాలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన కథానాయికల పెళ్లి వ్యవహారాలపై ఎంతో ఆసక్తి చూపుతారు. అందుకే.. మీడియా, పత్రికారంగాలు హీరోయిన్లను పెళ్లి విషయంపై నిత్యం ప్రస్తావిస్తూనే వుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పత్రిక శృతిని పెళ్లి విషయమై అడుగగా.. ఆమె కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.

గతంలో తన పెళ్లి గురించి ప్రస్తావించేందుకు తిరస్కరిస్తూ వచ్చిన శృతిహాసన్.. తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టేసింది. తనకి నచ్చినవాడు ‘సాంబారు అన్నం’లా వుండాలని ఆమె తెలిపింది. తాను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తే.. చిత్రపరిశ్రమకి చెందిన వ్యక్తితోనే చేసుకుంటానని స్పష్టం చేసింది. ఎందుకంటే.. తల్లిదండ్రులు చిత్రపరిశ్రమకి చెందినవారు కావడం ఒక కారణంకాగా, తనకిష్టమైన ఈ రంగంపట్ల తనకు కాబోయే వరుడికి అవగాహన వుండాల్సిన అవసరం వుందని ఆమె పేర్కొంది. ఒకవేళ తన మనసుకు నచ్చని వ్యక్తి తారసపడకపోతే.. పెళ్లి ఆలోచనే చేయనంటూ తేల్చి చెప్పేసింది. ఇలా ఈ విధంగా శృతి ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

‘మరి.. మీ మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా తారసపడ్డారా..?’ అని ప్రశ్నిస్తే.. ‘ఇంతవరకూ అలా ఎవరూ దొరకలే’దని శృతి సమాధానమిచ్చింది. ప్రస్తుతం తాను తెలుగు, తమిళ, హిందీ భాషాచిత్రాలతో చాలా బిజీగా వున్నానని, కెరీర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టానని తెలుపుతూ.. పెళ్లి టాపిక్ ని తెలివిగా డైవర్ట్ చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Hassan  Love Marriages  Actress Marriage Updates  

Other Articles