Deepika Padukone clarifies that not interested to enters in production house

Deepika padukone not interested in donning producers hat

Deepika Padukone news, Deepika Padukone gossips, Deepika Padukone hot photo shoot, Deepika Padukone production house, Deepika Padukone producer, Deepika Padukone controversy, Deepika Padukone cleavage show, Deepika Padukone my choice, Deepika Padukone hot

Deepika Padukone not interested in donning producers hat : Actress Deepika Padukone says that she has no intentions of donning the producer’s hat. It is the work behind the scenes that interests her.

‘ఛీ.. ఛీ.. నాకు అటువంటి ఉద్దేశమే లేదు’

Posted: 04/25/2015 03:24 PM IST
Deepika padukone not interested in donning producers hat

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె గతకొన్నాళ్ల నుంచి సెక్సీ విషయంలో వివాదాస్పదంగా నిలుస్తున్న విషయం తెలిసిందే! మొన్న బాయ్ ఫ్రెండ్స్ లను తరుచుగా మార్చడం.. నిన్న క్లీవేజ్ విషయంలో పత్రికతో వివాదం.. ప్రస్తుతం ‘మై ఛాయిస్’ వీడియో కాంట్రొవర్సీ.. ఇలా వరుస వివాదాలతో నిత్యం వార్తల్లోకెక్కుతూ సంచలన నటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ మీద తనకున్న అభిప్రాయాలను వెల్లడించి, మరోసారి వార్తల్లోకెక్కింది.

ఇటీవలే కొందరు బాలీవుడ్ నటీనటులు సినిమాల్లో నటిస్తూనే.. ‘నిర్మాణరంగం’లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా స్టార్ హోదాలో వున్న తారలందరూ నిర్మాణరంగంలో రాణిస్తున్నారు. ఇక దీపికా కూడా రెగ్యులర్ షూటింగులతో బాగానే డబ్బులు సంపాదించుకోవడంతోపాటు స్టార్ హీరోయిన్ గా పేరుగాంచింది. ఈ క్రమంలోనే ఈమె కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై దీపికాను.. ‘మీరెప్పుడు నిర్మాణ రంగంలో ప్రవేశిస్తారు?’ అని ప్రశ్నిస్తే.. అసలు తనకు నిర్మాత కావాలన్న ఉద్దేశమే లేదని అమ్మడు వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే దీపికా మాట్లాడుతూ.. ‘నేను డబ్బు వ్యక్తిగా వుండాలనుకోవడం లేదు. లాభం లేదా విజయం కోసమో నేనేది చేయాలనుకోవడం లేదు. నిర్మాతగా కాకుండా ఓ సినిమాకు వెనుక నుంచి చేసే పనికి మాత్రమే నేను ప్రాధాన్యమిస్తా! అలాగని త్వరలో ఇదంతా చేస్తానని చెప్పడం లేదు. ఒకవేళ నాకెప్పుడైనా అవకాశం వస్తే.. లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న పనిని చేయడానికి ఇష్టపడతాను. పేపర్లు నింపడం, ప్రింట్ అవుట్లు తీసుకోవడం లాంటివి ఇష్టపడతా. ఇలా ప్రొడక్షన్ లో నేను ఆసక్తి చూపుతానే కానీ.. సినిమా నిర్మాణరంగంలో రావాలన్న ఉద్దేశం నాకు లేదు’ అని తేల్చి చెప్పేసింది.

ఈ క్రమంలోనే దీపికా ఇండస్ట్రీపై తన అభిప్రాయం వెల్లడించింది. కొన్నేళ్ల నుంచి సినిమా నిర్మాణం కేవలం డబ్బుకోసమే రూపొందుతుందని తాను భావిస్తున్నానని తెలిపింది. చాలావరకు సినిమాలు డబ్బులపరంగా బిజినెస్ చేస్తేనే విజయం సాధించాయంటున్నారని, కానీ వాటికి రిపీట్ విలువ వుంటేనే ప్రేక్షకులు ప్రతిసారీ చూసేందుకు ఇష్టపడతారని దీపికా పేర్కొంది. అంతా బాగానే వుంది కానీ.. బిజినెస్ పరంగా ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించే అవకాశం వుందేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  My Choice  Bollywood Controversies  

Other Articles