producer C Kalyan | complaint | uttama villain

Complaint filed against producer c kalyan

Police complaint filed against producer C Kalyan, C Kalyan latest news, C Kalyan movies, producer C Kalyan, producer C Kalyan latest news, producer C Kalyan issue, producer C Kalyan flat issue, producer C Kalyan movies

complaint filed against producer C Kalyan: Producer c kalyan in troubles now. lady doctor kavitha given Police complaint filed against producer C Kalyan.

మహిళ డాక్టర్ పై కళ్యాణ్ చేయి చేసుకున్నాడట

Posted: 04/28/2015 10:59 AM IST
Complaint filed against producer c kalyan

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉత్తమ విలన్’ చిత్రాన్ని మే 1న తెలుగులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి సి.కళ్యాణ్ పై తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. సి. కళ్యాణ్ తనపై చేయి చేసుకున్నాడంటూ ఓ మహిళా డాక్టర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓ ఫ్లాట్ విషయంలో సి.కళ్యాణ్ తనను బెదిరిస్తున్నాడని, తనపై చేయి చేసుకున్నాడని డాక్టర్ కవిత తన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే మెట్రో రైలు నష్టపరిహారం కోసం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో 11 ఫ్లాట్ లకు 1.4 కోట్లు కవిత చెల్లించింది. అదే అపార్ట్ మెంట్ లో సి. కళ్యాణ్ కూడా నివాసం వుంటున్నారు. అయితే సి.కళ్యాణ్ ఈ విషయంపై వ్యతిరేకంగా వుండటం, పైగా ఫ్లాట్ యాజయానులపై బెదిరించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని, అంతే కాకుండా తనపై చేయి కూడా చేసుకున్నాడని డాక్టర్ కవిత అర్థరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

దీంతో పోలీసులు 506, 509, 345c సెక్షన్ల మీద సి.కళ్యాణ్ పై కేసు నమోదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. మరి ఈ విషయంపై సి.కళ్యాణ్ వాదన ఎలా వుండబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : producer C Kalyan  complaint  uttama villain  

Other Articles