Finally allari naresh tie knot with virupa | hyderabad city | chandrababu naidu

Allari naresh virupa marriage hyderabad city chandrababu naidu

allari naresh marriage, allari naresh virupa news, allari naresh updates, allari naresh marriage ceremony, allari naresh marriage updates, allari naresh virupa photos, chandrababu naidu, nara lokesh, mohan babu, manchu manoj, sampoornesh babu, rajamouli, keeravani

allari naresh virupa marriage hyderabad city chandrababu naidu : Finally Tollywood comedian hero allari naresh got married with virupa. In this ceremony film and political members visits.

అంగరంగ వైభవంగా జరిగిన అల్లరోడి పెళ్ళి

Posted: 05/30/2015 10:44 AM IST
Allari naresh virupa marriage hyderabad city chandrababu naidu

తెలుగు చిత్రపరిశ్రమలో కమెడియన్ హీరోగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న అల్లరి కుర్రాడు నరేష్ చివరికి ఒకింటివాడయ్యాడు. వేదాంత పండితుల మంత్రాలు, అతిథుల ఆశీర్వచనాల మధ్య ఈ అల్లరి హీరో విరూప మెడలో మూడు ముళ్లు వేసి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి 9.15 నిముషాలకు తెలుగు సంస్కృతీ-సంప్రదాయాల ప్రకారం జీలకర్ర, బెల్లం తంతుతో నరేష్, విరూప ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారాలోకష్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులతోపాటు మరికొందరు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు మనోజ్, నాని, ఇతర నటీనటులు విచ్చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకల్లో యువహీరోలందరూ ఫుల్ ఖుషీగా వుంటూ అక్కడికి విచ్చేసిన వారందరినీ తెగ నవ్వించేశారు. ముఖ్యంగా అల్లరోడి పెళ్లి జరుగుతున్న సందర్భంగా ‘వన్ వికెట్ డౌన్’ అంటూ నరేష్ పై సెటైర్లు వేసుకుంటూ ఎంజాయ్ చేశారు.

allari-naresh-mohan-babu
naresh-marriage-babu-lokesh
naresh-marriage-ganta
naresh-marriage-mandap
naresh-marriage-manoj
naresh-marriage-nani-couple
naresh-marriage-rajamouli
naresh-marriage-talasani

నరేష్ తల్లి సరస్వతి కుమారి, అన్నావదినెలు ఆర్యన్ రాజేష్, సుభాషిణీ అతిథుల్ని గౌరవంగా ఆహ్వానించారు. వెండితెరపై కితకితలు పెడుతూ నవ్వులు పండించే నరేష్ ఈ పెళ్లిలో సిగ్గుపడుతూ కనిపించాడు. ఇక పెళ్లి జరిగిన అనంతరం వధూవరులతో అందరూ సరదాగా, ఖుషీగా ఎంజాయ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh marriage  naresh virupa  chandrababu naidu  

Other Articles