kajal agarwal explains the importance of director | telugu film industry | telugu actresses

Kajal agarwal special interview director importance film industry

kajal agarwal news, kajal agarwal photos, kajal agarwal interview, kajal agarwal photo shoot, kajal agarwal gallery, kajal agarwal hot videos, kajal agarwal press meet, kajal agarwal director, kajal agarwal love affairs, kajal agarwal scandals, kajal agarwal

kajal agarwal special interview director importance film industry : Star actress kajal agarwal explains the importance of director who knows the exact values of roles and make a good film.

‘ఆయన’ ఏం చెబితే.. అదే చేస్తానంటున్న కాజల్!

Posted: 05/30/2015 11:24 AM IST
Kajal agarwal special interview director importance film industry

సినీ ఇండస్ట్రీలో వుండే నటీనటులందరూ ఎంత పైస్థాయికి ఎదిగినా.. ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం ఒదిగి వుండాల్సిందే! అప్పుడే వారిలో వుండే ప్రతిభ సినీజనాలకు తెలుస్తుంది. అలాగే.. వారికంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా..? అని ఆలోచిస్తున్నారా! మరెవ్వరో కాదు.. డైరెక్టర్. అవును.. సినిమా అవుట్ పుట్ సరిగ్గా రావాలంటే ఎంతటి స్టార్ హీరో, హీరోయిన్లనా.. డైరెక్టర్ చెప్పినట్లుగా నడుచుకోవాల్సి వుంటుంది. ఈ విషయంపైనే కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. తాను దర్శకుడి చెప్పినట్లుగా నడుచుకుంటానని తనకితాను మంచి నటిగా డప్పు వాయించుకుంటోంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే! అయితే.. చిన్నపాత్రలు లభిస్తే వాటిలో నటించేందుకు మీరు ఆసక్తి చూపుతారా..? లేదా..? అని ఒక మీడియావ్యక్తి అడిగిన ప్రశ్నకి ఆమె ఆసక్తికరమైన సమాధానం వెల్లడించింది. ‘తెరపై ఎక్కువసేపు కనిపించాలని నటీనటులందరికీ ఆశ వుంటుంది. అందుకు నేనూ మినహాయింపు కాదు. అయితే.. దర్శకుడి ఆలోచనల మేరకే చేయాలనుకుంటున్నా. ఏ పాత్రలో ఎవరెలా నటించాలో..? ఎంతసేపు ఆ పాత్ర వుండాలో..? అన్న విషయాలు దర్శకులకు బాగా తెలుసు. వారి చెప్పినట్లుగా నడుచుకుంటే దానికి అవుట్ పుట్ సరిగ్గా వస్తుంది. కాబట్టి.. పాత్ర ఎంత చిన్నదైనా ఫర్వాలేదు.. మంచిగా వుంటే చాలు.. నటించడానికి సిద్ధమే’నని వెల్లడించింది.

‘సినిమా అనేది దర్శకుడి సృష్టి. ఏ పాత్ర ఎలా వుండాలో వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు చిన్న పాత్రే ఇచ్చారని నిరాశ చెందుతుంటాం. కానీ ఆ పాత్రతోనే అందరికంటే ఎక్కువ పేరు మనమే తెచ్చుకుంటాం. అలా నా కెరీర్ లో బోలెడన్నిసార్లు జరిగింది. అందుకే.. దర్శకులతో ఎప్పుడూ పాత్ర గురించి, వాటి నిడివి గురించి చర్చించను. అయితే.. ఒక్కసారి కథ వింటా.. పాత్ర తీరుతెన్నులు ఎలా వున్నాయో అంచనా వేస్తా.. ఆ తర్వాత నుంచి దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోవడమే’ అని అంటోంది కాజల్. ఇలా ఈ విధంగా తాను దర్శకుడు చెప్పినట్లుగా చేస్తానని కాజల్ స్పష్టం చేసింది.

తెలుగులో ఆఫర్లు లేని కాజల్ తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది. అటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. తొందరపాటుతో వరుసగా సినిమాలు ఒప్పుకోకుండా.. మంచి పాత్రలు కలిగినవున్న సినిమాలనే ఒప్పుకుంటున్నానని కాజల్ తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  telugu directors  telugu heroines  

Other Articles