దేశవ్యాప్తంగా సినీజనాలు ఎంతగానో వేచి చూస్తున్న ‘బాహుబలి-ది బిగినింగ్’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. ఈరోజు (01-06-2015) ఉదయం 10.30 నిముషాలకు థియేటర్లలో విడుదల చేసిన ఈ వండర్ ట్రైలర్ ను సాయంత్రం 5 గంటలకు సామాజిక మాధ్యమాల్లో అఫీషియల్ గా యూనిట్ బృందం విడుదల చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా గత మూడేళ్ల నుంచి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ట్రైలర్.. అందరినీ ఔరా! అనిపించే విజువల్ వండర్ తో ఆశ్చర్యం కలిగిస్తోంది. అందమైన లొకేషన్లు, అద్భుతమైన పోరాట విన్యాసాలు, హాలీవుడ్ సినిమాలను తలదన్నేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ ట్రైలర్ ని రూపొందించారు.
ఇక ఈ ట్రైలర్ గురించి ప్రస్తావించుకుంటే.. ప్రకృతి ఒడిలోనుంచి జాలువారుతున్నట్లుగా అనిపించే జలపాతం ప్రదేశంలో యువరాణి అవంతికా (తమన్నా) నృత్యం చేస్తూ దేవకన్యలా కనువిందు చేస్తుంది. ఆమె అందానికి పరవశించిపోయిన శివుడు (ప్రభాస్) ఆమె దగ్గరకు చేరుకోవడం కోసం అటువైపుగా వున్న బండరాయి మీద నుంచి అవంతికావైపు దూకుతాడు. కట్ చేస్తే.. భల్లాదేవ (రానా) అతని మహిష్మతి రాజ్యంలో ఎందరో ప్రజల్ని తన బానిసలుగా మార్చుకుని హింసిస్తుంటాడు. వారిద్వారా తన కార్యకలాపాలు నిర్వహించుకుంటాడు. కట్ చేస్తే.. కురుక్షేత్రం యుద్ధాన్ని తలపించే విధంగా వేలాదిమంది సైనికులు పోరాడే మహాయుద్ధం.. పెద్దపెద్ద ఏనుగులు, రాత్రి అడవిలో యుద్ధ సన్నివేశాలు, బంధీగా వుండే దేవసేన (అనుష్క), వీరుడిలా ప్రత్యర్థి సైన్యాన్ని చీల్చిచెండాతుడూ దూసుకువస్తున్న బాహుబలి (ప్రభాస్).. అద్భుతమైన గ్రాఫికల్ విజువల్స్ తో ఈ ట్రైలర్ రూపొందింది.
థియేటర్ లో విడుదలైన ఈ ట్రైలర్ కి భారీస్థాయిలో స్పందన లభించింది. ఈ ట్రైలర్ ని చూసేందుకు వేలాదిమంది జనాలు థియేటర్లముందు కాలక్షేపం చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తే.. థియేటర్ లో వీక్షించినవారు ఔరా అంటూ చూస్తుండిపోయారు. కేవలం ట్రైలర్ కే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడాన్ని చూస్తుంటే.. భారతీయ సినీపరిశ్రమలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more