రెండేళ్ల నుంచి అదిగోఇదిగో ఇప్పుడు సెట్స్ మీదికెళుతుందంటూ వాయిదా పడుతూ చివరికీ మే 29వ తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ‘పవర్’ వంటి పవర్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్రాలోని పూణే సమీపంలో ఒక గ్రామందగ్గర షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దర్శకత్వంలో ఒక ప్రత్యేక భారీ సెట్ ని రూపొందించారు. పవన్ ఇంట్రొడక్షన్ సీన్ కోసం దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో ఇద్దరూ హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం! ఇప్పటికే అనీషా ఆంబ్రోస్ మొదటి హీరోయిన్ గా ఎంపిక కాగా.. మరో నాయికకు ఈ సినిమాలో స్థానముందని.. ప్రస్తుతం రెండో హీరోయిన్ పాత్రకోసం అన్వేషణ జరుగుతోందని తెలిసింది. ఆ రెండో హీరోయిన్ పాత్ర ఈ చిత్రానికి ఎంతో కీలకమైందని.. ఆ పాత్రకు తగ్గట్టు తారను ఎంపిక చేస్తున్నారని యూనిట్ బృందం తెలిపింది. దీంతో.. మొదటి చిత్రంలో శృతితో రొమాన్స్ చేసిన పవన్.. ఈ చిత్రంలో ఇద్దరి భామల నడుమ లీలలు నడపనున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనునట్లు యూనిట్ తెలుపుతోంది.
ఈ సినిమాని నిర్మాత శరత్ మరార్ భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లో ప్రముఖ నటీనటులు త్వరలోనే జాయిన్ కానున్నారు. ఈ చిత్రం షూటింగ్ చకచకా ముగించుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more