Producer dilraju announced release date of kerintha movie | youthful movies | tollywood news

Kerintha movie release date producer dilraju youth films mickey j mayer

kerintha movie, producer dilraju, dilraju news, dilraju movies, kerintha movie updates, kerintha movie gallery, kerintha movie updates, youthfull movies, telugu movies

kerintha movie release date producer dilraju youth films mickey j mayer : Producer dilraju announced release date of kerintha movie. He expected that the movie will get good reviews from audience as like before he made.

యూత్ ని ‘కేరింత’ పెట్టించనున్న నిర్మాత దిల్ రాజు

Posted: 06/02/2015 01:16 PM IST
Kerintha movie release date producer dilraju youth films mickey j mayer

డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రముఖ నిర్మాత స్థాయికి ఎదిగిన నిర్మాత దిల్ రాజు.. అన్నిరంగాల ఆడియెన్స్ ని ఆకర్షించే చిత్రాలను తెరకెక్కించారు. యూత్ కి మెచ్చే ‘కొత్త బంగారులోకం’ వంటి లవ్ మూవీ.. కుటుంబ సమేతంగా వీక్షించే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫ్యామిలీ సినిమా.. మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించే ఎన్నో యాక్షన్ చిత్రాలను ఈ నిర్మాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమాలను బట్టి చూస్తుంటే.. దిల్ రాజు మంచి అభిరుచి కలిగిన నిర్మాత అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహాలోనే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్ ని అలరించే మరో కొత్త చిత్రం ‘కేరింత’తో ఆయన ముందుకొస్తున్నారు.

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో అడవి కిరణ్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు ‘కేరింత’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్12 న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ కొత్త బంగారులోకం’ సినిమా తరువాత ఆ తరహాలోనే తక్కువ బడ్జెట్ లో కొత్తవాళ్ళతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాం. ‘కేరింత’ స్టొరీ సాయి చెప్పగానే నాకు నచ్చి ఓకే చెప్పాను. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నిజమైన స్నేహం, ప్రేమ అంశాలతో సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు.

ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సాయికిరణ్, సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ ఇద్దరూ కుర్రకారు హృదయాలకి ఈ సినిమా దగ్గరకు తీసుకెళ్లారని దిల్ రాజు వారిని ఆకాశానికెత్తేవారు. తాము ఆశించే స్థాయిలో ఈ సినిమాకి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి.. ఈ చిత్రం ఏ విధంగా కుర్రకారులు ‘కేరింత’లు పెడుతుందో వేచి చూడాల్సిందే!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerintha movie  producer dilraju  mickey j mayer.  

Other Articles