తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పులి’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఓ పాటను పాడారు. విజయ్ పాట పాడటం ఇదేమి కొత్త కాదు. గతంలో తాను నటించిన ‘తుపాకీ’ సినిమాలో ‘గూగుల్...’ మరియు ‘కత్తి’ సినిమాలో ‘సెల్ఫీ పుల్లా..’ పాటలను పాడాడు విజయ్. ఆ రెండు పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి.
దీంతో ‘పులి’ సినిమాలో కూడా విజయ్ ఓ పాట పాడలంటూ అభిమానులు విజ్ఞప్తి చేసారు. దీంతో ఈ సినిమాలోని ఓ పాటను విజయ్ పాడారు. ఇటీవలే ఈ పాటను రికార్డ్ చేసారు. అభిమానుల విజ్ఞప్తి చేయడంతో ‘పులి’ సినిమాలో ఓ పాట పాడక తప్పలేదని చిత్ర యూనిట్ వెల్లడించారు.
చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శిబు థామీన్స్, పిటీ సెల్వాకుమార్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శ్రీదేవి కపూర్, హన్సిక, సుదీప్, నందిత శ్వేత తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Video Source: KingStar Vithu
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more