Pranitha To Romance with Balakrishna in Dictator Movie

Pranitha to romance with balakrishna in dictator movie

pranitha, pranitha news, pranitha dictator movie, dictator movie news, balakrishna news, balakrishna 99 film, balakrishna dictator movie, dictator movie updates, dictator telugu movie, balakrishna family movies, balakrishna updates, balakrishna photos, pranitha photo shoot, pawan kalyan, director srivas, actress anjali

Pranitha To Romance with Balakrishna in Dictator Movie : Actress Pranitha Pranitha Got Huge Offer to act with Nandamuri Balakrishna's 99 film Dictator as second heroine.

నందమూరి గూటికి చేరిన ‘మెగా’ భామ

Posted: 06/11/2015 11:31 AM IST
Pranitha to romance with balakrishna in dictator movie

అప్పటివరకు చిన్నసినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీసిన కన్నడ భామ కస్తూరి ప్రణీతకు ‘అత్తారింటికి దారేది’ చిత్రం భారీ విజయం అందించింది. పవర్ ఆ మూవీలో స్టార్ పవన్ కల్యాణ్ సరసన రెండో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. కన్నడ, తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులు ఈ అమ్మడు దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే ఈమెకి తమిళంలో సూర్య సరసన ‘మాస్’(రాక్షసుడు) చిత్రంలో నటించే బంపరాఫర్ వరించింది. ఇప్పుడు తెలుగులో మరో భారీ అవకాశాన్ని చేజిక్కించుకుంది.

వరుసగా సినిమాలు చేస్తూ జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 99వ సినిమా బిజీలో పడ్డారు. శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్’గా అలరించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇటీవల లాంఛనంగా పూజ జరుపుకొన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 20 నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణను పవర్‌ఫుల్ పాత్రలో చూపే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారని ఇదివరకే యూనిట్ బృందం తెలిపింది. అందులో ఒక హీరోయిన్‌గా నటి అంజలిని ఇప్పటికే ఎంపిక చేశారు. మిగిలిన రెండో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్‌ వీడింది. ఎందుకంటే.. ఆ పాత్రకు నటి ప్రణీతను ఎంపిక చేసినట్లు సమాచారం. బాలకృష్ణ లాంటి అగ్ర హీరో సరసన అవకాశం రావడంతో ప్రణీత ఫుల్ హ్యాపీగా వుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
 
కోన వెంకట్, గోపీ మోహన్ తదితర అయిదుగురు రచయితలు కలసి రూపొందించిన ఈ చిత్రానికి ఓ అద్భుతమైన కథను అందిస్తున్నారు. ఈ కథ మీద దర్శకుడు శ్రీవాస్ కూడా అపారంగా నమ్మకం పెట్టుకున్నారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి తన గత హిట్స్ జోరును ‘డిక్టేటర్’ మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈరోస్’తో పాటు ఆయన కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranitha  balakrishna  dictator movie  anjali  

Other Articles