దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’! ఈ మూవీలో అనుష్క ప్రధానపాత్ర పోషించగా.. మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. ఇక హీరో రానా, నిత్యామీనన్ లు కీలకపాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాదాపు రూ.70 కోట్లకంటే ఎక్కువ వ్యయంతో రూపొందిన ఈ చిత్రంపై టాలీవుడ్ లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
ఇదిలావుండగా.. ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి వుండేది. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ మూవీని విడుదల చేయాలని అప్పట్లో మూవీ యూనిట్ భావించింది. కానీ ఇంతలోనే ఆర్థిక ఇబ్బందలు తలెత్తడంతో రిలీజ్ ని వాయిదా వేయక తప్పలేదు. అదిగో, ఇదిగో వుంటూ ప్రేక్షకులను ఊరించారే తప్ప.. ఖచ్చితమైన తేదీని అప్పట్లో తెలియపరచలేదు. అయితే.. ఆర్థిక పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని జూన్ 26వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. భారీ బడ్జెట్‌తో ఇండియాలోనే మొదటిసారిగా స్టీరియో స్కోపిక్ 3డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 26న తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మార్క్ సంగీతం హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.
ఇదిలావుండగా.. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో చిత్రబృందం సంతోషంగా వుందని చెప్పుకుంటున్నారు. ‘యూ’ సర్టిఫికెట్ రావడంతో ఈ చిత్రాన్ని చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరూ వీక్షించే అవకాశం వుండటంతో మూవీని కలెక్షన్లు మరింత ఎక్కువ స్థాయిలో వస్తాయని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరి.. గతకొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు గుణ శేఖర్ కి.. ఈ కలల ప్రాజెక్ట్ ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more