Producer Sudhakar Reddy complaint aginst on Charmi

Producer sudhakar reddy complaint aginst on charmi

Nithin father complaint on Charmi, Sudhakar Reddy complaint aginst on Charmi, Charmme kaur apologizes to nithin, Charmme kaur apologizes, Charmme kaur apologizes to Puri jagannadh, Charmme kaur latest news, Charmme kaur movie news, Charmme kaur movie updates, Charmme kaur stills, Charmme kaur gallery

Nithin father complaint on Charmi: Tollywood Producer, Actor Sudhakar Reddy angry on actress charmi. Sudhakar Reddy complaint aginst on Charmi.

ఆయనకు ఛార్మి క్షమాపణలు సంతృప్తి పరచలేవు!

Posted: 06/18/2015 05:49 PM IST
Producer sudhakar reddy complaint aginst on charmi

పూరీ జగన్నాథ్, నితిన్ లు ఓ సినిమా చేయబోతున్నారని, కానీ ఈ ప్రాజెక్టు ఇటీవలే ఆగిపోయిందనే విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఆగిపోవడానికి తాను కారణం కాదని, ఏవో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందంటూ ఛార్మి పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ తన తప్పును గ్రహించిన ఛార్మి.. అందుకు ఓ క్లారిటీ ఇచ్చేసింది. నిజానికి పూరీ, నితిన్ ల ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో తనకు కూడా స్పష్టంగా తెలియదని, అయితే ఏవో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఎవరో చెబితే అదే నిజమనుకొని చెప్పేసానని తెలిపింది. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా అలా నేరుగా చెప్పినందుకు సిన్సియర్ గా క్షమాపణలు తెలియజేస్తున్నానని ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

ఈ విషయాన్ని నితిన్ మరియు పూరీ జగన్నాథ్ లు తేలికగా తీసుకున్నప్పటికీ నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత అయినటువంటి సుధాకర్ రెడ్డి.. ఛార్మిపై తెలుగు సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసారు. ఛార్మి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా క్షమాపణలు చెప్పినప్పటికీ సుధాకర్ రెడ్డి మాత్రం సంతృప్తి చెందక ఫిర్యాదు చేసారు. సుధాకర్ రెడ్డి నుంచి తమకు ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు.

మరి ఈ విషయంపై ఛార్మి ఎలా స్పందించనుందో చూడాలి. అయితే సుధాకర్ రెడ్డి కోసం ఛార్మి మరోసారి బహిరంగంగా అందరి ముందు క్షమాపణలు చెబుతుంది కావచ్చు తప్ప.. ఇంకేం జరగదు అంటూ సినీవర్గాలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై ఛార్మి, పూరీ జగన్నాథ్, నితిన్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Sudhakar Reddy  complaint  Charmi  Producers Council  

Other Articles