Allu Arjun| Race Gurram Film | 62 Filmfare

Allu arjun race gurram film nominated in 62 filmfare

Allu Arjun Race Gurram Film Nominated in 62 Filmfare, Race Gurram Film Nominated in 62 Filmfare, Allu Arjun Race Gurram in 62 Filmfare, Allu Arjun movie news, Allu Arjun latest updates, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun latest news, Allu Arjun awards, Allu Arjun details, Allu Arjun movie awards, Allu Arjun

Allu Arjun Race Gurram Film Nominated in 62 Filmfare: Allu arjun latest block buster hit film Race gurram. This film nominated in 62 film fare awards. Race gurram movie nominated in 6 categories.

స్టైలిష్ స్టార్ రేసుగుర్రంకు అవార్డుల పంట పండనుందా?

Posted: 06/26/2015 01:27 PM IST
Allu arjun race gurram film nominated in 62 filmfare

దక్షిణ భారతదేశంలో జరిగే ప్రతిష్టాత్మకమైన అవార్డులు ‘ఫిల్మ్ ఫేర్’. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల సినిమాలకు ప్రతీ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులతో సత్కారిస్తుంటారు. ఈ అవార్డుల వేడుకను ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా నిర్వహిస్తు వుంటారు. ఈ ఏడాది కూడా 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరుగనుంది. ఇందులో భాగంగా 2014లో విడుదలైన సినిమాలను పలు విభాగాల్లో నామినేషన్ గా ఎంపిక చేసారు. అందులో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నటించిన ‘రేసుగుర్రం’ చిత్రం ఆరు విభాగాల్లో నామినేట్ అయ్యింది.

Race Gurram - BEST FILM
Allu Arjun - BEST ACTOR (MALE)
Shruti Haasan- Race Gurram
Surendra Reddy- Race Gurram
S S Thaman- Race Gurram
Simha- Cinema Choopista Mama- Race Gurram

‘రేసుగుర్రం’ చిత్రంలో స్టైలిష్ స్టార్ చాలా కొత్తగా కనిపించాడు. నిజానికి అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలో కొత్తగా, డిఫరెంట్ గా కనిపిస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ వుంటాడు. ఇదంతా కేవలం తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి నుంచే వచ్చిందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. స్వయంకృషితో పైకొచ్చిన చిరంజీవి ఇప్పటికీ పలు దర్శకనిర్మాతలకు, నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకుంటూనే సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఫైట్స్, యాక్షన్, డాన్స్... ఇలా అన్ని కళలలో పరిపూర్ణ నటుడిగా మెరుగుపరచుకుని ప్రేక్షకుల గుండెల్లో ‘మెగాస్టార్’ అయ్యాడు. ఆ తర్వాత తన డాన్సులతో కొత్త స్టైల్ ను క్రియేట్ చేసాడు. మెగాస్టార్ అయ్యాక వరుస హిట్ చిత్రాలతో ప్రజల గుండెల్లో చిరంజీవి సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీకీ వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకొని ‘పవర్ స్టార్’ అయ్యాడు. అలాగే వచ్చిన మరో స్టార్ హీరో అల్లు అర్జున్. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య మనవడు, ప్రముఖ నటుడు, నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ తనయుడు అయినటువంటి అల్లు అర్జున్ మొదటగా చిరంజీవి ప్రోత్సాహంతోనే వెండితెరకు పరిచయమయ్యాడు. అల్లు అర్జున్ ను ముద్దుగా అభిమానులు ‘బన్నీ’ అని పిలుచుకుంటారు.

చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమాలో ఓ చిన్న బిట్ లో అద్భుతంగా డాన్స్ చేసి, అందరి చేత ‘శభాష్’ అనిపించుకున్నాడు. అక్కడ చిరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘గంగోత్రి’. 2003లో ప్రముఖ దర్శకుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 100వ చిత్రమైన ‘గంగోత్రి’లో అల్లు అర్జున్ చాలా చక్కగా నటించాడు. ఓ యువ ప్రేమికుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు కీరవాణి పాటలు ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు ఉత్తమ నటుడిగా ‘మా’ అవార్డు దక్కింది.

ఆ తర్వాత వచ్చిన ఆర్య చిత్రం అల్లు అర్జున్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ ఒక్క సినిమాయే అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ గా మార్చేసింది. 2004వ చిత్రంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే భారీ రెస్పాన్స్ వచ్చేసింది. అప్పట్లో యూత్ అంతా కూడా బన్నీ స్టైల్ ను ఫాలో అయిపోయారు. ‘ఆర్య’ సినిమా ప్రతి ఒక్క యువత తనను తాను కనెక్ట్ చేసుకునేలా చేసింది. ప్రేమించడంలో వున్న ఆనందమేంటో ‘ఆర్య’ సినిమాలో చూపించారు. ఇందులో బన్నీ యాక్టింగ్ సింప్లీ సూపర్బ్. ఇందులో బన్నీ చేసిన యాక్షన్, డాన్సులు ఇప్పటికి మారుమ్రోగుతునే వున్నాయి. వన్ సైడ్ లవ్ కు వున్న పవర్ ఏంటో బన్నీ తన స్టైల్లో చెప్పాడు. ఇందులో బన్నీ చాలా స్టైలిష్ గా, కొత్తగా కనిపించాడు. డాన్సులు, ఫైట్స్, యాక్షన్.. ఇలా అన్నింటిలో చాలా స్టైలిష్ గా కనిపించడంతో బన్నీకి అభిమానులు ‘స్టైలిష్ స్టార్’ అనే బిరుదు ఇచ్చేసారు. ఈ సినిమా ఊహించని రేంజులో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అంతే కాకుండా ఈ సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.

‘ఆర్య’ తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’, ‘హ్యాపీ’ చిత్రాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినప్పటికీ నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ‘బన్నీ’ సినిమాలో మాస్, ‘హ్యాపీ’ సినిమాలో కామెడీ ఎంటర్ టైనర్ ను అందించాడు. ఈ సినిమాల తర్వాత 2007లో వచ్చిన ‘దేశముదురు’ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా స్టైలిష్ స్టార్ క్రేజ్ బాగా పాపులర్ చేసేసింది. 2007లో వచ్చిన ‘దేశముదురు’ సినిమాలో బన్నీ అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవరూ చేయని విధంగా తొలిసారిగా ఈ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. ఆ క్రెడిట్ బన్నీకే దక్కింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇందులో బన్నీ యాక్షన్, ఫైట్స్, డాన్స్ అన్ని సూపర్బ్. కానీ ముఖ్యంగా ఇందులో బన్నీ డైలాగ్స్ అదిరిపోయాయి. బాలగోవిందం పాత్రలో బన్నీ అదరగొట్టాడు.

‘దేశముదురు’ తర్వాత బన్నీ నటించిన ‘పరుగు’, ‘ఆర్య2’, ‘వరుడు’, ‘వేదం’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు కమర్షియల్ గా హిట్టవ్వకపోయినా కూడా నటుడిగా మంచి మార్కులే సొంతం చేసుకున్నాడు. ఇక ‘పరుగు’, ‘వేదం’ చిత్రాలకు బన్నీకి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు అవార్డులు(2009 & 2011) దక్కాయి. ఈ సినిమాల తర్వాత బన్నీ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత 2011లో వచ్చిన ‘బద్రీనాథ్’ సినిమాతో స్టైలిష్ స్టార్ గా బన్నీ తన విశ్వరూపం చూపించాడు. స్టైలిష్ స్టార్ అంటే కేవలం డ్రెస్సుల్లోనే కాదు.. చేసే ప్రతి పనిలో కూడా స్టైల్ వుండాలనే విధంగా ‘బద్రీనాథ్’ చిత్రాన్ని చాలా స్టైలిష్ గా చూపించాడు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవర్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఇందులో బద్రీనాథ్ క్షేత్రానికి రక్షకుడిగా పాత్రలో బద్రినాథ్ గా బన్నీ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం తన హెయిర్ స్టైల్ ను చాలా స్టైలిష్ గా మార్చేసుకున్నాడు. అంతే కాకుండా ఇందులో బన్నీ చేసిన యాక్షన్ సీన్స్ సూపర్బ్. ‘బద్రీనాథ్’ చిత్రం మలయాళంలో కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. మలయాళంలో స్టార్ హీరోలైనటువంటి మోహన్ లాల్, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల తర్వాత భారీ క్రేజ్ వున్న స్టార్ హీరో అల్లు అర్జున్. అక్కడ బన్నీని ‘మల్లు అర్జున్’ అని అభిమానులు పిలుచుకుంటారు. ‘మల్లు అర్జున్’ గా బన్నీకి మలయాళంలో బాగా క్రేజ్ వుంది.

‘బద్రీనాథ్’ చిత్రం తర్వాత బన్నీ నటించిన ‘జులాయి’ ఓ పవర్ ఫుల్ మైండ్ గేమ్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’ సినిమా ప్రతి ఒక్కరి మైండ్ ను రిఫ్రెష్ చేసుకునే విధంగా వుంటుంది. ఎత్తుకు పై ఎత్తు ఎలా వెయ్యాలో అద్భుతంగా చూపించారు. ఇందులో బన్నీ చాలా చక్కగా నటించాడు. ‘జులాయి’ తర్వాత బన్నీ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలిచింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో బన్నీ ఓ స్టైలిష్ స్ట్రీట్ సింగర్ గా నటించాడు. ఇందులో తన పాత్రకు అనుగుణంగా పూర్తి స్టైలిష్ గా కనిపించాడు. లుక్స్ పరంగా కూడా చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో బన్నీ చేసిన ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ కేక. ఇప్పటి వరకు అలాంటి యాక్షన్ సీన్ ఏ సినిమాలో కూడా రాలేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బన్నీ యాక్షన్ సింపేసాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత బన్నీ ‘ఎవడు’ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించాడు. కనిపించేది కొద్ది సన్నీవేశాలే అయినప్పటికీ సినిమా మొత్తం కూడా బన్నీ వున్నట్లుగానే అనిపిస్తుంది. ‘ఎవడు’ తర్వాత బన్నీ నటించిన చిత్రం ‘రేసుగుర్రం’.

బన్నీ కెరీర్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘రేసుగుర్రం’. ప్రముఖ స్టైలిష్ మాస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. సురేంధర్ రెడ్డి ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఇందులో అల్లు అర్జున్ ‘లక్కీ’ పాత్రలో నటించాడు. ఎలాంటి పనిచేయకుండా బేవార్స్ గా తిరిగే ఓ ఇంట్లోని చిన్నకొడుకుగా బన్నీ నటించాడు. బన్నీ ఇందులో తన స్టైలిష్ స్టార్ అనే స్థాయిని పక్కనపెట్టి ఓ సాధారణ వ్యక్తిగా నటించాడు.

లక్కీ అన్నయ్యగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రామ్ పాత్రలో నటుడు శ్యామ్ నటించాడు. వీరిద్దరూ రామలక్ష్మణుల్ల వుండాలని కోరుకునే తల్లితండ్రులు. అయితే వీరిద్దరూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే వుంటారు. అక్కడ రౌడీషీటర్ అయినటువంటి శివారెడ్డి రాజకీయాల్లోకి రాకుండా రామ్ తన డ్యూటీ తాను చేస్తుంటాడు. తనకు అడ్డొస్తున్నాడని రామ్ ను చంపించాలని శివారెడ్డి మనుషులను పురమాయిస్తాడు. కానీ అనుకోకుండా ఆ రామ్ స్థానంలోకి లక్కీ వస్తాడు. శివారెడ్డి మనుషులు రామ్ అనుకొని లక్కీని చంపే ప్రయత్నం చేస్తారు. కానీ చావు నుంచి తప్పించుకున్న లక్కీ అసలు విషయం తెలుసుకొని ఇక శివారెడ్డికి తుప్పు వదలగొడతాడు. కానీ ఇదంతా మనుసులో పెట్టుకొని మళ్లీ లక్కీ కుటుంబంపై శివారెడ్డి రాజకీయనాయకుడిగా మారి దాడి చేయిస్తాడు. ఇక శివారెడ్డిని లక్కీ ఎలా అంతం చేసాడనేదే ‘రేసుగుర్రం’ స్టోరీ. అంతేకాకుండా ‘రేసుగుర్రం’ చిత్రాన్ని మలయాళంలోకి ‘లక్కీ’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

ఇందులో లక్కీ పాత్రలో బన్నీ ఇరగదీసాడు. కానీ బన్నీ ఒక్కడే ఇరగదీసాడు అని చెప్పుకుంటే సరిపోదు కదా! మిగతా పాత్రలు కూడా బాగుంటేనే సినిమా బాగా ఆడుతుంది. కానీ ఈ సినిమాలోని అందరూ నటీనటులు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. అల్లు అర్జున్ కు అన్నగా, ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు శ్యామ్ చాలా చక్కగా నటించాడు. ఇక రౌడీషీటర్ శివారెడ్డి పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు రవికిషన్ సూపర్బ్. తన హవాభావాలతో రవికిషన్ అదరగొట్టేసాడు. బన్నీకి గట్టిపోటినిచ్చాడు. రేసుగుర్రంతో పోటీపడాలంటే రవికిషన్ అయితేనే పర్ఫెక్ట్ అనే విధంగా శివారెడ్డి పాత్రకు వందశాతం న్యాయం చేసాడు. ఇక హీరోయిన్ గా శృతిహాసన్ కేవలం గ్లామర్, పాటలకు మాత్రమే పరిమితమవ్వకుండా ఇందులో హీరోతో పాటు సినిమా మొత్తం కూడా చాలా చక్కగా నటించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఇక చివర్లోని ‘సినిమా చూపిస్త మావ..’ పాటలో మాస్ స్టెప్పులేసి యువతకు పిచ్చెక్కించేసింది. ఇక శృతిహాసన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ చాలా కొత్తగా కనిపించాడు. నో సౌండ్... ఓన్లీ సైలెన్స్ అనే విధంగా చాలా కొత్త పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక చివరగా కిల్ బిల్ పాండే. స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ లీడర్ కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచాడు. సినిమా చివర్లో కిల్ బిల్ ఎంట్రీ నుంచి నవ్వులే నవ్వులు. అంతే కాకుండా కిల్ బిల్ కోసం స్పెషల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కేక. ఇంకా మిగతా నటీనటులు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు.

ఇక సాంకేతిక వర్గానికొస్తే... ఈ సినిమాకు వక్కంతం వంశీ అద్భుతమైన కథను అందించాడు. వక్కంతం వంశీ గతంలో చాలా హిట్ చిత్రాలకు కథను అందించాడు. అయితే ఈ సినిమా స్టోరీ కేవలం బన్నీ మాత్రమే చేయగలడు అనిపించే విధంగా చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ఇక ప్రస్తుతం వున్న టాలీవుడ్ కమర్షియల్ స్టైలిష్ దర్శకులలో సురేంధర్ రెడ్డి ఒకరు. ‘రేసుగుర్రం’ చిత్రాన్ని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, సెంటిమెంట్, కామెడీ, డాన్స్, ఫైట్స్,... ఇలా అన్ని రకాలుగా చాలా చక్కగా చూపించాడు. అన్ని సెంటర్ల ప్రేక్షకులకు కూడా బాగా నచ్చే విధంగా సురేంధర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రానికి థమన్ మంచి మ్యూజిక్ ను అందించాడు. ఇందులో థమన్ అందించిన ‘సినిమా చూపిస్త మావ...’ పాట ఇప్పటికీ మారుమ్రోగుతూనే వుంది. ఈ సినిమాకు థమన్ అద్భుతమైన రీరికార్డింగ్ ను అందించాడు. ఇక ‘రేసుగుర్రం’ సినిమా ఇంత అద్భుతంగా కనిపించడానికి ముఖ్య కారకుడు సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ప్రతి ఫ్రేంను కూడా చాలా చక్కగా చూపించాడు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించాడు. కొన్ని కొన్ని సన్నీవేశాలను చాలా స్టైలిష్ గా క్యాప్చర్ చేసారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు రామ్-లక్ష్మణ్ లు అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ను అందించారు. రేసుగుర్రంతో యాక్షన్ చేస్తే ఇలాగే వుంటుంది అనే విధంగా ఫైట్స్ కంపోజ్ చేసారు.

ఈ సినిమా తాజాగా 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో 6 విభాగాల్లో నామినేట్ అయ్యింది. మరి ఇన్ని విశేషాలున్న ‘రేసుగుర్రం’ సినిమాకు అవార్డుల పంట పండటం ఖాయమని సినీవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. మొత్తానికి ‘రేసుగుర్రం’ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాకుండా ఇపుడు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా రికార్డ్ క్రియేట్ చేయబోతుందని అటు సినీవర్గాలు, ఇటు అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ సంధర్భంగా ‘రేసుగుర్రం’ చిత్రానికి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెబుతోంది తెలుగు విశేష్.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Allu Arjun  Race Gurram  Nominations  62 Filmfare awards  

Other Articles