Anushka Shetty’s Size Zero Shooting Completed

Size zero movie goes to post production works from sets

size zero movie goes to post production works from sets, Anushka Shetty’s Size Zero Shooting Completed, size zero, Anushka, Arya, tollywood, kollywood

Arya and Anushka starer Size Zero had completed its shooting part. The movie being made simultaneously in Telugu and Tamil will now enter extensive post-production phase. The makers are yet to reveal their release plans

పోస్టు ప్రోడక్షన్స్ పనుల్లో అనుష్క రోమాటిక్ థ్రిలర్ సైట్ జీరో..

Posted: 07/19/2015 02:46 PM IST
Size zero movie goes to post production works from sets

నటి అనుష్క, నటుడు ఆర్య నటిస్తున్న సైజ్ జీరో మూవీ షూటింగ్ పూర్తైంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెఫ్ట్‌తో తెరకెక్కింది. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న సైజ్ జీరో చిత్రీకరణను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

బాహుబలి వంటి విజువల్ వండర్‌లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరోతో మన ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో మళ్లీ బరువు తగ్గి నార్మల్ అయింది. కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు. అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి దర్శకత్వం ప్రకాశ్ కోవెలమూడి, సంగీతం యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ నిర్వాషా, ఆర్ట్ ఆనంద్‌సాయి, కథ-స్క్రీన్ ప్లే కణిక థిల్లాన్, కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సందీప్ గుణ్ణం, నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : size zero  Anushka  Arya  tollywood  kollywood  

Other Articles