Allari naresh james bond movie to release on july 24

Allari naresh james bond movie to release on july 24

Allari naresh, Rana, Allari naresh latest news, Allari naresh news, Allari naresh movies, Allari naresh james bond photos, Allari naresh james bond movie, naresh james bond movie, Allari naresh james bond movie collections, Allari naresh james bond latest updates, Allari naresh james bond movie news, Allari naresh cinema News, Allari naresh upcomming movies

tollywood comedian hero allari naresh forth comming movie with out and out comedy to hit screens on 24th july world wide

అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్దం

Posted: 07/19/2015 02:49 PM IST
Allari naresh james bond movie to release on july 24

అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత మాట్లాడుతూ తమ బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందించామన్నారు. అల్లరి నరేష్ కామెడి ప్రేక్షకులకు మంచి కామెడి టానిక్ అవుతుంది. అలాగే సాక్షి చౌదరి చక్కగా నటించింది.

మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. సాయికిషోర్ గారు చక్కగా తెరకెక్కించారన్నారు. ఇటీవల విడుదలైన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతానందించారన్నారు. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికిశోర్ మచ్చ.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari naresh  james bond  Allari naresh latest updates  

Other Articles