Mahesh Babu Srimanthudu Audio Launch

Mahesh babu srimanthudu audio launch

Srimanthudu Audio Launch, Srimanthudu Audio release, Srimanthudu Audio songs, Srimanthudu Audio details, Srimanthudu Audio launch updates, Srimanthudu Audio launch stills, Srimanthudu movie songs, Srimanthudu songs released, Srimanthudu

Mahesh Babu Srimanthudu Audio Launch: Mahesh Babu Srimanthudu audio released on 18 july. Devi Sri Prasad Music. Koratala shiva direction. Shruti Haasan heroine.

ఘనంగా మహేష్ బాబు శ్రీమంతుడు ఆడియో విడుదల

Posted: 07/20/2015 10:27 AM IST
Mahesh babu srimanthudu audio launch

‘మిర్చి’ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, శృతిహాసన్ జంటగా మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోల విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని శ్పికళావేదికలో ఘనంగా జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి సీడీని ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ గంటా శ్రీనివాసరావుకి అందించారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో మహేష్ బాబు, శృతిహాసన్, సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల, నమ్రత శిరోద్కర్‌, గౌతమ్, వి.వి.వినాయక్‌, జగపతిబాబు, ఆదిశేషగిరిరావు, శ్రీకాంత్‌ అడ్డాల తదితరులు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ... ‘శ్రీమంతుడు’ టీజర్‌, ట్రైలర్స్‌ చూశాను. చాలా బాగుంది. ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి, నిర్మాతలకు మంచి లాభాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ... చిన్నోడి అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే! మీకు, మీ అభిమానులందరికీ దిమ్మ తిరిగిపోతుంది... కలెక్షన్స్‌ బద్ధలైపోతుందని చెబుతున్నాను. ‘శ్రీమంతుడు’ చిత్ర యూనిట్ కి ఆల్‌ ది బెస్ట్‌ అని అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ... మహేష్ అభిమానులు సక్సెస్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చూసిన విదేశాల్లోని మన వాళ్లు మళ్లీ వాళ్ల ఊరేళ్లి దత్తత తీసుకోవాలని అనుకునేంత మంచి సబ్జెక్ట్ ఇది. కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కించారు. మహేష్ కి దేవుడు అందంతో పాటు కాస్త చిలిపితనం, చలాకీతనం, తుంటరితనం అన్నింటీని ఇచ్చాడనిపిస్తుంది. దేవి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

మహేష్‌ బాబు మాట్లాడుతూ... దేవి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించాడు. ‘జాగోరే...’ అనే సాంగ్ నా కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అవుతుంది. దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పాలంటే అతనొక ఒక ఎక్స్‌ట్రార్డినరీ రైటర్‌. కథ ఏం చెప్పాడో... అంత కంటే సినిమాను అద్భుతంగా తీశారు. మది సినిమాటోగ్రఫి సూపర్. ఈ సినిమాను ఒప్పుకున్నందుకు జగపతిబాబు గారికి థ్యాంక్స్. ఆయన తప్ప ఈ పాత్రను ఎవరూ చేయలేరనే విధంగా నటించారు. నేను కమల్ హాసన్ గారికి పెద్ద ఫ్యాన్. కానీ ఆయన కూతురు శృతిహాసన్ తో కలిసి పనిచేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. శృతి ఒక టెరిఫిక్ పెర్‌ఫార్మర్‌. ఇందులో అధ్బుతంగా నటించింది. ఇక రాజేంద్రప్రసాద్‌, సుకన్య ఇలా అందరితో నటించేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో పనిచేసినట్లుగా భావించాను. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ లు తొలిసారి ప్రొడక్షన్ చేస్తున్నప్పటికీ సినిమాని చక్కగా నిర్మించారు. అభిమానుల కోసం ఎప్పుడూ కూడా మంచి సినిమాలే చేయాని ప్రయత్నిస్తుంటాను. కానీ లాస్ట్‌ టైమ్‌ డిసప్పాయింట్‌ చేశాను. అందులో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని అభిమానులు పెద్ద హిట్ చేసి ఈసారి నా పుట్టినరోజుకి పెద్ద కానుక ఇస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Srimanthudu  Audio Launch  Songs  Trailer  

Other Articles