RP Patnaik Angry on TV Serial Directors and Producers

Rp patnaik angry on tv serial directors and producers

RP Patnaik Fires on TV Serial Directors, RP Patnaik Fires on TV Serial Producers, RP Patnaik Fires on TV Serials, RP Patnaik Angry on TV Serials, RP Patnaik Fires on Atto Attamma Kuthuro, RP Patnaik latest news, RP Patnaik movies, RP Patnaik movie updates, RP Patnaik angry, RP Patnaik fires, RP Patnaik stills, RP Patnaik press meet, RP Patnaik

RP Patnaik Angry on TV Serial Directors and Producers: Tollywood Music Director RP Patnaik Fires on Telugu Atto Attamma Kuthuro TV Serial Directors and Producers.

ఆర్పీకి కోపం తెప్పించిన అత్త... ఘాటు వార్నింగ్!

Posted: 07/31/2015 05:54 PM IST
Rp patnaik angry on tv serial directors and producers

తెలుగు టీవీ సిరియల్స్ దర్శకులు, నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు, దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసాడు. గతకొద్ది కాలంగా టీవి సీరియల్స్ లలో ఒరిజినల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాడకుండా సినిమాలలోని పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను వాడుతున్నారు. దాదాపు అన్నీ సీరియల్స్ లలో కూడా ఇదే జరుగుతుంది. కొన్ని సీరియల్స్ అయితే మరి దారుణంగా వరుస ఎపిసోడ్లు కూడా సినిమా సాంగ్ లతో లాంగిచేస్తున్నారు.

అయితే ఈ విషయంపై ఆర్పీ పట్నాయక్ చాలా సీరియస్ అయ్యాడు. ఈ విషయంపై తాజాగా ఆర్పీ పట్నాయక్ ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీరియల్స్ తీసే వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసాడు. తన ఆగ్రహం మొత్తం చూపించేసాడు.


Video Courtesy : Movie Mitra

ఈ సంధర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ... టీవి సీరియల్స్ మీద మొట్టమొదటి ధ్వజం నా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇకముందు గురించి నాకు తెలియదు. అసలు టీవి సీరియల్స్ వారు విచ్చలవిడిగా వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా.. మేము సినిమాలకోసం చేసిన ట్రాక్స్, పాటలు వాళ్ల సొంత పాటల్లా వాడేసుకుంటున్నారు. అయినా క్షమించేసాం. విడుదలవ్వని సినిమా పాటలు కూడా వీళ్లు వాడేసుకుంటున్నారు. అంటే.. మీ టీవి సీరియల్ సాంగ్ మేం సినిమాలో వాడుకున్నట్లా? అసలు ఏం అనుకుంటున్నారు? ఆ..! ‘అత్తో అత్తమ్మ కూతురు’ సీరియల్లో నిన్న రాత్రి నా ‘తులసీదళం’ సినిమాలో పాట మొత్తం వచ్చేసింది. ‘తులసీదళం’ సినిమా ఇంకా విడుదలవ్వలేదు. అంటే జనాలు ఏం అనుకుంటారు? మీ సీరియల్ లోని పాటను మేం సినిమాకోసం వాడుకున్నట్లా? అసలు ఏంటి మీ ఇష్టం వచ్చినట్లుగా మా పాటలు వాడుకోవటానికి మీకు రైట్స్ ఎవరిచ్చారు? నా సొంత బ్రదర్ అయినా కూడా ఈ విషయంలో క్షమించేది లేదు. ఈ ‘అత్తో అత్తమ్మ కూతురో’ సీరియల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మీద 50లక్షలు డ్యామేజ్ క్లైమింగ్ పేరుతో కేసు పెడతాను. ఎవరికి భయపడేది లేదు. తర్వాత నా ట్రాక్ కానీ, మా మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్స్ కానీ ఎవ్వరైనా, ఎక్కడైనా వాడారంటే... అయిపోతారు! చూస్కోండి.. WAIT AND SEE అంటూ చాలా ఘాటుగా, సీరియస్ తన ఆగ్రహం వ్యక్తం చేసాడు. మరి ఈ విషయంపై సదరు సీరియల్ దర్శకనిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RP Patnaik  Fires  Angry  TV Serials  Atto Attamma Kuthuro serial  press meet  stills  

Other Articles