అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బ్యానర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ “భలే భలే మగాడివోయ్”. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. మారుతి దర్శకుడు. బన్నివాసు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో బిజిగా వుంది. ఇటీవలే విడుదల చేసిన మెషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ రావటంతో యూనిట్ సబ్యులందరూ ఆనందంగా వున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు గోపిసుందర్ సంగీతాన్ని అందించిన ఈచిత్ర ఆడియోని స్వాతంత్రదినోత్సవ సంధర్బంగా అగష్టు 15న ప్రముఖుల మరియు అభిమానుల సమక్షంలో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: ” భలే భలే మగాడివోయ్ షూటింగ్ పూర్తయింది. నటించటానికి వీలున్న మంచి పాత్ర చేశానన్న తృప్తివుంది. మారుతితొ పనిచేయటం చలా హ్యపిగా వుంది. తక్కువ టైంలో ఈచిత్రం పూర్తయింది. లావణ్య త్రిపాఠి మంచి కోస్టార్. అల్లు అరవింద్ గారి సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బ్యానర్ పై UV Creations బ్యానర్ లో బన్నివాసు నిర్మాతగా ఈచిత్రం చేయటం చాలా హ్యపిగా వుంది. ఎక్కడా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్పకుండా ఫ్యామిలి అంతా ధియోటర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. నవ్విస్తూనే వుంటాం. ఇటీవల విడుదల చేసిన మెషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ” అని అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ: మా చిత్రం భలే భలే మగాడివోయ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాల్లో వుంది. ఇప్పడు ఆడియో వేడుకకి సిధ్ధమవుతుంది. నేషనల్ అవార్డు విన్నర్ గోపిసుందర్ అందించిన ఆడియోని స్వాతంత్రదినోత్సవం సంధర్బంగా అగష్టు 15న విడుదల చేస్తున్నాము. ప్రమోషన్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని డిఫరెంట్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాము. ఇటీవల విడుదల చేసిన మెషన్ పోస్టర్ రెస్పాన్స్ బాగుంది. మెమరి నిల్..ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ అనే క్యాప్షన్ అందరికి ఆకట్టుకుంది. ఇటీవల గోవాలో తీసిన సాంగ్ మరియు టైటిల్ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్స్ విజిల్స్ కొట్టించేలా వుంటాయి. నిజార్ కెమెరా వర్క్ సూపర్బ్ గా వుంటుంది. నేను ఏ కథ తీసుకున్నా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ తో చేస్తాను. ఈ చిత్రం మరింత ఎంటర్‌టైన్‌మెంట్ తో చేశాను. కథలోనే కామెడి, కేరక్టర్స్ లోనూ కామెడి వుండటంతో చిత్రం ఆద్యంతం నవ్వుతూనే వుంటారు. నిర్మాత బన్నివాసు తో మరోక్కసారి చేయటం ఆనందంగా వుంది. ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకున్ని ఆకట్టుకునేలా ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా రూపోందింది. అని అన్నారు
ఈ సందర్భంగా నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ “ఏక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. మారుతి అనుకున్నది అనుకున్నట్టే తీసాడు. షూటింగ్ టైం లోనే యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశారు. కోత్తజోనర్ లో చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని చాలా బాగా నటించారు. ఆయన కేరక్టర్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవల విడుదల చేసిని మెషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మెమరి నిల్.. ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ అనే క్యాప్షన్ చాలా కొత్తగా వుందని అందరూ అంటున్నారు. ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ విత్ ఎంటర్టైన్‌మెంట్ తో చిత్రీకరించాం. చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రోడక్షన్ లో బిజిగా వుంది. ఆగష్టు 15న భలే భలే మగాడివోయ్ ఆడియో రిలీజ్ చేస్తాం. నేషనల్ అవార్డు విన్నర్ గోపిసుందర్ అందించిన ఆడియో ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో గా నిలుస్తుంది. చిత్రం కూడా ఫ్యామిలి అంతా నవ్వుకునే విధంగా వుంటుంది. ఆడియో వేడుకకి చిత్ర ప్రముఖులు విచ్చేస్తారు” .అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more