Hero Prabhas Grabs First Place In South Industry As Top Actor | Hero Vijay | Kollywood

Prabhas first place top hero south industry latest survey

prabhas, telugu industry, tamil movie, telugu movies, bahubali movie, bahubali collections, bahubali movie updates, prabhas bahubali, vijay, puli vijay, vijay latest news, tollywood, kollywood

Prabhas First Place Top Hero South Industry Latest Survey : In The Latest Survey Of South Film Industry.. Telugu Actor Prabhas Got First Place As Top Hero And Vijay In Second Place.

మొదటి స్థానాన్ని కొట్టేసుకుపోయిన ప్రభాస్

Posted: 08/19/2015 06:46 PM IST
Prabhas first place top hero south industry latest survey

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు..? అనే విషయమై గతకొన్నాళ్ల నుంచి నెలకొన్న కన్ఫ్యూజన్ తొలగిపోయింది. నిన్నటివరకు టాలీవుడ్ లో పవన్, మహేష్ లలో నెంబర్ వన్ స్థానం ఎవరిది అనే గట్టిపోటి వుండేది. అలాగే తమిళంలోనూ విజయ్, సూర్య, విక్రమ్, ఇంకా తదితర హీరోల్లో మొదటిస్థానం ఎవరిది అనే గొడవ అభిమానుల మధ్య జరుగుతుండేది. తమ అభిమాన నటుడే మొదటి స్థానంలో వున్నాడని ఓ హీరో ఫ్యాన్ ప్రచారం చేసుకుంటే.. లేదు మా హీరో అంటూ మరికొందరు వాదనలు చేసుకునేవారు. ఈ వాదోపవాదనలను వినలేక అప్పుడప్పుడు ఓ సర్వే నిర్వహిస్తుంటారులెండి. ఇప్పుడు తాజాగా ఓ సర్వే నిర్వహించగా.. అందులో మొదటి స్థానంలో ఎవరు కొనసాగుతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

సౌత్ ఇండియా వైడ్ గా నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో హీరో ప్రభాస్ నిలిచాడని సమాచారం. ఆ తర్వాత రెండో స్థానంలో తమిళ నటుడు విజయ్ నిలిచాడు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని జరిపిన ఈ తాజా సర్వేలో ప్రభాస్, విజయ్ ల పేర్లు ముందువరుసలో కనిపించాయి. ఆ తర్వాత తక్కిన స్థానాల్లో మిగిలిన స్టార్ హీరోలు నిలిచారు. ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఆయన నటించిన ‘బాహుబలి’ చిత్రమేనని స్పష్టంగా అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఆ చిత్రం దేశవ్యాప్తంగా విశేష స్పందనతో భారీ విజయం సాధించింది. అలాగే.. ప్రభాస్ కి మరింత అభిమానుల్ని తెచ్చిపెట్టింది. ఆ ప్రభావంతోనే ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడని తెలుస్తోంది. ఇక వరుస విజయాలతో (అదికూడా 100 కోట్ల క్లబ్లో చేరుతూ) విజయ్ దూసుకెళుతుండటం ఈ సర్వేపై ప్రభావం చూపించి వుండవచ్చునని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా.. ఈ సర్వేతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలెవరన్న విషయమై చిక్కుముడి విడిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Tollywood  Bahubali  Vijay Puli  

Other Articles