Actress Bindu Madhavi Became Talk Of The Town By Giving Half Remuneration Back To Producer Arun Pandyan | Kollywood News

Bindu madhavi gave half remuneration back producer arun padyan

bindu madhavi, bindu madhavi latest news, bindu madhavi controversies, bindu madhavi tamil movies, bindu madhavi updates, producer arun pandyan, bindu madhavi arun pandyan

Bindu Madhavi Gave Half Remuneration Back Producer Arun Padyan : Actress Bindu Madhavi Became Talk Of The Town By Giving Half Remuneration Back To Producer Arun Pandyan Who Stuck In Financial Problems During Producing A Movie.

హీరోయిన్లూ.. ‘బిందు’ను చూసి నేర్చుకోండి!

Posted: 08/29/2015 05:03 PM IST
Bindu madhavi gave half remuneration back producer arun padyan

ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఎదగాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. ఆ స్థాయి పొందడం కోసం దేనికైనా తెగించడానికి సిద్ధంగా వుంటారు. ఇతరుల విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా, తమకు అనుకూలంగా వుండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయంలో హీరోలతోపాటు హీరోయిన్లు ఎక్కువ తెలివే ప్రదర్శిస్తారులెండి. అందుకే.. కొన్ని సందర్భాల్లో దర్శకనిర్మాతలు, హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వుంటాయి. అయితే.. ఈ విధంగా ప్రవర్తించే వారందరికీ బుద్ధి చెప్పేలా నటి బిందుమాధవి ఓ మంచి పని చేసి చూపింది. ఆ మంచి పని చేయడం వల్ల ఆమెకు మరిన్ని మర్యాదలు పెరిగిపోయాయి. ‘హీరోయిన్ అంటే అలా వుండాలి’ అని ఆమె గురించి కోలీవుడ్ లో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? అనేగా సందేహం! ఆ విషయం తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

గతంలో తమిళంలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన నటుడు అరుణ్ పాండ్యన్.. ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఓ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బిందుమాధవి నటించింది. ఈ సినిమా రూపొందించడానికి ముందు బడ్జెట్, ఇతర వ్యవహారాలకు ఎంత ఖర్చవుతుందో అంతా ప్లాన్ వేసుకున్నారు. కానీ.. చిత్రీకరణ నేపథ్యంలో బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువగా దాటిపోవడంతో.. నిర్మాత అరుణ్ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. రోజురోజుకి సమసస్యలు మరింత పెరిగిపోవడంతో అతని పరిస్థితిని గమనించిన బిందు.. తన పారితోషికంలో కొంత డబ్బును తిరిగి ఇచ్చేసి, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచింది. దాంతో బిందుమాధవికి మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్ అంటే తెరపై హీరోతో కష్టాల్ని పట్టించుకోవడమే కాదు.. నిర్మాత నష్టాలను కూడా కాస్ట పట్టించుకోవాలని, అది బిందును చూసి హీరోన్లందరూ నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు సూక్తులు చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ మంచి పనితో అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bindu madhavi  arun pandyan  kollywood gossips  

Other Articles