Alia Bhatt Give Counter To Amitabh Bachchan On Twitter | Bollywood News | Indian Film Industry Updates

Alia bhatt counter amitabh bachchan tweet bollywood news

alia bhatt, amitabh bachchan, twitter, alia amitabh twitter fight, twitter fight incidents, bollywood celebrities, celebrities twitters, celebrities news

Alia Bhatt Counter Amitabh Bachchan Tweet Bollywood News : Bollywood Young Actress Alia Bhatt Give Counter To Amitabh Bachchan On Twitter.

‘బిగ్-బీ’కి కౌంటరిచ్చిన బుల్లి బ్యూటీ

Posted: 08/29/2015 05:46 PM IST
Alia bhatt counter amitabh bachchan tweet bollywood news

సినీతారల మధ్య అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఘటనలు జరుగుతుంటాయి. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం, సరదగా జోరులేసుకోవడం వంటి సందర్భాలూ ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఆ తరహాలోనే తాజాగా బాలీవుడ్ బిగ్-బీ అమితాబ్ బచ్చన్, బుల్లిబ్యూటీ ఆలియాభట్ మధ్య జరిగింది. వారిరువురు ఒకరిపై మరొకరు చేసుకున్న కామెంట్లు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.

సాధారణంగా నటీనటులందరూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు దగ్గరగా వుంటారు. ఈ విషయంలో బిగ్-బీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ సినిమాలు, ఇతర వ్యవహారాలతోపాటు తన పర్సనల్ విషయాల గురించి కూడా ట్వీట్లు చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే ఆలియా భట్ తన ట్విటర్ అకౌంట్ లో పెట్టిన ఓ కామెంట్ కు అమితాబ్ తనదైన శైలిలో స్పందించారు. బిగ్-బీ స్పందనను చూసిన ఆలియా.. ఆ వెంటనే ఆమె కూడా కౌంటర్ వేసింది.

ఇంతకీ ఆ కామెంట్లు ఏమిటంటే.. ‘అవకాశం వస్తే నాకు డ్యాన్సర్ లేదా యాక్టింగ్ టీచర్ కావాలని వుంది’ అని ఆలియా తొలుత పోస్ట్ చేసింది. ఆ కామెంట్ కి అమితాబ్ స్పందిస్తూ.. ‘నేను నీకు విద్యార్థిని అవుతా’ అని ట్వీట్ చేశారు. దీన్ని చూసిన ఆమె ‘మీరే పెద్ద యాక్టింగ్ ఇన్స్ టిట్యూషన్.. అలాంటిది స్టూడెంట్ గా మారతానంటారా’ అని పేర్కొంది. అలా వారిద్దరూ చేసుకున్న ట్వీట్లపై బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alia bhatt  amitabh bachcha  alia amitabh twitter fight  

Other Articles