Bollywood Actress Parineeti Chopra Spent 1 Million For 2 Shirts In Indonesia | Bollywood Celebrities

Parineeti chopra spent 1 million for 2 shirts indonesia jakarta

Parineeti Chopra news, Parineeti Chopra updates, Parineeti Chopra shirts value, Parineeti Chopra controversy, Parineeti Chopra indonesia shopping, Parineeti Chopra million controversy, indonesia jakarta, Parineeti Chopra shopping news, Parineeti Chopra shirts news

Parineeti Chopra Spent 1 Million For 2 Shirts Indonesia Jakarta : Bollywood Hot Actress Parineeti Chopra Spent 1 Million For 2 Shirts In Indonesia Which Gone Viral On Internet.

రెండు చొక్కాలకు 10 లక్షలు ధారబోసింది!

Posted: 09/09/2015 06:14 PM IST
Parineeti chopra spent 1 million for 2 shirts indonesia jakarta

ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో వున్న సెలబ్రిటీల దగ్గర ఆస్తిపాసులు భారీగానే వుంటాయి. అందుకే.. తమకిష్టమైన వస్తువులపై కొన్ని కోట్ల రూపాయలు ధారబోయడానికైనా వెనుకాడరు. నేటి ఆధునిక యుగానికి తగ్గట్టు అధునాతన టెక్నాలజీతో రూపొందే వస్తువులపై ఆమాత్రం ఖర్చుచేయడం సాధారణమే! కానీ.. కేవలం రెండు చొక్కాలకోసం ఏకంగా 10 లక్షలు ధారబోయడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే విషయమే! పైగా.. ఆ చొక్కాలు తయారైంది ఏ బంగారపు పూతతోనే, ఇతర సామాగ్రీలతోనో తయారు కాలేదు. రోజువారీగా వేసుకునే సాధారణ చొక్కాలే! ఆ విషయం తెలిసినప్పటికీ ఆ అమ్మడు 10 లక్షలు ధారబోయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది.

ప్రస్తుతం పరిణీతి చోప్రా ఇండోనేషియాలోని జకార్తాలో చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లిన ఈ అమ్మడు.. ఖాళీ సమయంలో సరదాగా గడుపుతోంది. ఈ క్రమంలోనే షాపింగ్ కి వెళ్లింది. అక్కడ తనకు నచ్చిన రెండు చొక్కాలు కనిపించాయి. అంతే! వాటి ధర ఎంత అని చూడకుండా కొనుగోలు చేసింది. తీరా బిల్లు చూస్తే.. ఏకంగా ఒక మిలియన్ (10 లక్షలు) వచ్చింది. ఈ బిల్లు చూసిన ఆమెకు కళ్లు బైర్లు కమ్మాయో లేక గర్వంగా ఫీల్ అయ్యిందో తెలీదు కానీ.. కేవలం రెండు చొక్కాల కోసం తాను 1 మిలియన్ ఖర్చు చేసినట్లు ట్విటర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమదైన రీతిలో కామెంట్లు కూడా చేశారు. కానీ.. ఆ తర్వాత మరో అసలు విషయం తెలిసింది.

అదేమిటంటే.. ఆమె 10 లక్షలు ఖర్చు చేసింది ఇండోనేషియాలో కదా! ఆ మిలియన్ కరెన్సీని ఇండియన్ రూపాయల్లో మారిస్తే కేవలం రూ.4,500 మాత్రమే! ఇదీ అసలు విషయం. ఈ విషయం చాలామంది నెటిజన్లకు తెలియక.. కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ విషయం తెలిసిన పరిణీతి.. అసలు విషయాన్ని దాచేసి, కేవలం ఇండోనేషియన్ కరెన్సీలో కొన్ని విలువనే తెలియజేసి తన అభిమానుల్ని తికమక పెట్టేసింది. ఏదేమైనా.. ఈ ఒక్క పోస్టుతో పరిణీతి మరోసారి వార్తల్లో తెగ హల్ చల్ చేసేసింది. పైగా.. దీన్ని బట్టి చూస్తుంటే.. స్టార్స్ ఏదీ చేసిన అభిమానులకీ మంచి కిక్ ఇస్తోందని అర్థమవుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parineeti Chopra  Bollywood Celebrities  

Other Articles