Rakul Preet Singh Says Thanks Director Srivasu For Giving Chance To Act In Loukyam Movie As Heroine | Loukyam One year Complete

Rakul preet singh thanks director srivasu loukyam movie unit twitter

rakul preet singh, loukyam movie, director srivasu, gopichand, rakul preet singh twitter, rakul latest news, rakul preet controversies, rakul preet latest photo shoot, rakul preet in loukyam movie

Rakul Preet Singh Thanks Director Srivasu Loukyam Movie Unit : Rakul Preet Singh Says Thanks Director Srivasu For Giving Chance To Act In Loukyam Movie As Heroine.

ఆ డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పిన రకుల్

Posted: 09/26/2015 01:15 PM IST
Rakul preet singh thanks director srivasu loukyam movie unit twitter

రకుల్ ప్రీత్ సింగ్.. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ‘కెరటం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెకు.. ఆ తర్వాత కొద్దోగొప్పో అవకాశాలు మాత్రమే వచ్చేవి. ఇంతలోనే ఈమెకు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’లో నటించే మంచి ఆఫర్ లభించింది. ఆ సినిమా సక్సెస్ అయింది. అయినప్పటికీ ఈ అమ్మడికి ఆఫర్ల కోసం కొన్నాళ్లపాటు వెయిట్ చేయక తప్పలేదు. ఇంతలోనే ఓ డైరెక్టర్ ఈమెని సంప్రదించాడు.. తాను తీయబోతున్న ఓ భారీ సినిమాలో నటించాల్సిందిగా కోరాడు.. చేతికందిన అవకాశాన్ని వదులుకోకూడదని ఒప్పుకుంది.. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతే! రకుల్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో ‘లౌక్యం’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే! ఈ చిత్రంలోనే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ దెబ్బతో రకుల్ కి భారీ సినిమాల్లో నటించే అవకాశాలు వరించాయి. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’, ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, బన్నీ-బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. తనకు ఈ స్థాయికి ఎదిగేలా హెల్ప్ అయింది ‘లౌక్యం’ సినిమా అని, ఆ చిత్రం ఇప్పటికీ విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా ఆ మూవీ యూనిట్ కి థ్యాంక్స్ చెప్పింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తనకు మంచి విజయాన్ని అందిస్తే.. ‘లౌక్యం’ సెకండ్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అందించిందని.. ఆ సినిమా తన కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమైందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ శ్రీవాసుకు కృతజ్ఞతలు తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  loukyam movie  director srivasu  

Other Articles