Finally Anushka Shetty's Latest Flick Size Zero Movie Release Date Has Announced By Movie Unit | PVP Banner Movies

Anushka shetty size zero movie release date fixed arya prakash kovelamudi pvp banner

anushka shetty news, anushka shetty movies, size zero movie, size zero release date, size zero movie updates, size zero posters, size zero movie gallery, anushka in size zero movie, arya in size zero

Anushka Shetty Size Zero Movie Release Date Fixed Arya Prakash Kovelamudi PVP Banner : Finally Anushka Shetty's Latest Flick Size Zero Movie Release Date Has Announced By Movie Unit. This Movie Is Releasing On Oct 9

ఎట్టకేలకు ‘సైజ్ జీరో’ విడుదల తేదీ ఖరారయ్యింది

Posted: 09/26/2015 04:03 PM IST
Anushka shetty size zero movie release date fixed arya prakash kovelamudi pvp banner

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘సైజ్ జీరో’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కూడా విడుదలయ్యింది. అయితే.. ఈ మూవీ విడుదల తేదీపై దర్శకనిర్మాతలు ఇన్నాళ్లూ క్లారిటీ ఇవ్వలేకపోయారు. షూటింగ్ సమయంలో చాలా బిజీగా వున్న నేపథ్యంలో విడుదల తేదీని ఖరారు చేయలేకపోయారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో.. అక్టోబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు యూనిట్ ప్రకటించింది. తొలుత మరో డేట్ కి ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావించారని, కానీ చివరగా అక్టోబర్ 9వ తేదీనే ఫిక్స్ చేసినట్లు యూనిట్ వెల్లడించింది.

ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పీవీపీ సంస్థ నిర్మించింది. కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఇందులో ప్రధానపాత్రలో నటించిన అనుష్క ఈ మూవీకి మేజర్ హైలైట్ అని అంటోంది. ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేసి, హీరోయిన్‌గా సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అనుష్క, సైజ్ జీరో సినిమా ద్వారా మరో సాహసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం ఆమె 30 కేజీలకు పైనే బరువు పెరగడం నిజంగా గర్వించదగ్గ విషయమనే చెప్పుకోవాలి. ఇటీవల విడుదలైన ఈ టీజర్.. ఈ సినిమాపై మరింత ఆసక్తి రేపింది. అటు దర్శకనిర్మాతలు సైతం ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్మకంతో వున్నారు. మరి.. ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే.. అక్టోబర్ 9వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty  size zero release date  

Other Articles