ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలంటే కేవలం నటన, ఫాలోయింగ్ వుంటే సరిపోదు... సరైనా కథాంశంతో కూడిన చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందితేనే ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఈ సూత్రం ప్రతిఒక్కరికి వర్తిస్తుంది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా పసిగట్టిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటిదాకా తన బ్రాండ్ ఇమేజ్‌తో వరుస సినిమాలు చేసుకుంటూపోయిన చెర్రీ.. ప్రస్తుతం టాలీవుడ్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తననితాను మలుచుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవల ‘బ్రూస్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చెర్రీకి కాస్త నిరాశే మిగిలింది. ఆ చిత్రం భారీ విజయం సాధిస్తుందని మూవీ యూనిట్‌తోపాటు చెర్రీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ.. యావరేజ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా.. ఈ సినిమా కథ అంతగా ఇంప్రెసివ్‌గా లేదని, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేదని విశ్లేషకులు తేల్చి పారేశారు. అందుకేనేమో.. చెర్రీ ఇప్పుడు స్ర్కిప్ట్ రైటింగ్‌పై దృష్టి పెడుతున్నాడు. సినిమా స్క్రిప్టుపై పట్టు తెచ్చుకునే క్రమంలో భాగంగా త్వరలో ఓ షార్ట్ టర్మ్ కోర్సు చేయడానికి రెడీ అవుతున్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సుకి హాజరవుతాడట. ఈ విషయాన్ని స్వయంగా తనే వెల్లడించాడు కూడా. అయితే, ఏ దేశంలో ట్రైనింగ్ తీసుకుంటాడన్నది మాత్రం వెల్లడించలేదు. మంచి కథలను ఎంచుకోవడానికి ఈ కోర్సు తనకి ఉపయోగపడుతుందని చరణ్ చెబుతున్నాడు.
ఇదిలావుండగా.. తమిళంలో భారీ విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో చెర్రీ హీరోగా రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందని అంతా భావించారు. కానీ.. ఆ చిత్రం మొదలవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిసింది. ఈ ఖాళీ సమయంలో చెర్రీ తన ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్ కోసం త్వరలో లండన్ వెళుతున్నాడు. ఆ ట్రిప్ అయిన వెంటనే స్ర్కిప్ట్ కోర్సులో చేరి, ఆ తర్వాత తన తదుపరి చిత్రాలపై దృష్టి సారిస్తాడని చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more