Sonam Kapoor: Don't Work For Those Who Pay You Less

Don t work for those who pay you less sonam kapoor

sonam kapoor, sonam kapoor prem ratan dhan payo, sonam kapoor prdp, sonam kapoor upcoming movies, sonam kapoor latest movies, sonam kapoor recent movies, entertainement news

Sonam Kapoor says instead of "complaining" about unequal remuneration, women should stop working with those who pay them less.

ఆ నిర్మాతలతో పనిచేయకపోవడమే పరిష్కారం..

Posted: 11/01/2015 06:54 PM IST
Don t work for those who pay you less sonam kapoor

కష్టపడి పనిచేసినా.. శ్రమకు తగిన గుర్తింపు లభించకపోతే.. వారితో నటించడం మానేయడమే తగిన పరిష్కారమని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వ్యాఖ్యానించింది. కష్టపడి పనిచేసిన దానికి తగిన రెమ్యూనరేషన్ లభించనప్పుడు వారితో ఇకపై పనిచేయకపోవడమే చక్కని పరిస్కారమని చెప్పింది. సరైన పారితోషికం అందనిపక్షంలో దాని కోసం పోరాడాల్సిందేనని.. అయితే చక్కని మార్గంలో పోరాటం చేయడం కూడా ప్రధానమని చెప్పింది. ఇందుకు సదరు నిర్మాతలు, దర్శలకుల నేతృత్వంలో మరోమారు పనిచేయకూడదని ఇదే తానిచ్చే చక్కని సూచన అని చెప్పింది.

ముంబయిలో జరిగిన మామీ ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన సోనమ్ విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా రెమ్యూనరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కొందరు నటీమణులు తమకు శ్రమకు తగిన పారితోషకం లభించలేదని పిర్యాదులు చేస్తున్నారని, ఇది అరోపణలు చేయడం సబబు కాదని అమె అభిప్రాయపడ్డారు. ఇక రెన్యూమరేషన్ విషయలో పిర్యాదులు చేయడంకూ కూడా వద్దని, మరోసారి వారితో పనిచేయకపోతే చాలునని తేల్చిచెప్పింది. బాలీవుడ్ హీరోల కంటే హీరోయిన్ లకే పారితోషికం ఎక్కువగా ఇస్తున్న విషయం ఇటీవల చర్చనీయాంశమైంది. కాగా, ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో సల్మాన్ సరసన సోనమ్ నటించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonam Kapoor  pay you less  actress  bollywood  

Other Articles