music maestro ilayaraja is done with his 1000th movie

Milestone in music maestro ilayaraja music

milestone in ilayaraja music, maestro, ilayaraja, Sasi kumar, varalaxmi, ilayaraja songs, ilayaraja hits, ilayaraja melodies, ilayaraja hits free download, ilayaraja telugu hits, ilayaraja tamil songs, ilayaraja songs download, ilayaraja biography

another milestone in music maestro ilayaraja music, he is done with 100th movie and running with century plus

శతాధిక రికార్డు దిశగా ఇళయరాజ..

Posted: 11/01/2015 07:04 PM IST
Milestone in music maestro ilayaraja music

ఈ తరం సంగీత దర్శకులకు మార్గదర్శిగా నిలిచిన సంగీత మాంత్రికుడు ఇళయరాజా తన జీవితంలో మరో మైలు రాయిని అధిగమించనున్నాడు. ఇప్పటి సంగీత దర్శకులు 50వ సినిమా చేయటమే చాలా కష్టంగా కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా 1000 సినిమాలకు సంగీతం అందించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ను త్వరలోనే సొంతం చేసుకోబోతున్నారు, సౌత్ సినిమా మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా. తన స్వర ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించిన ఈ స్వర మాంత్రికుడు సంగీతం అందించిన 1000వ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది.

ఇళయరాజ కెరీర్లో మైల్స్టోన్ లాంటి సినిమా కావటంతో ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సుబ్రమణ్యపురం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తరువాత హీరోగా మారిన శశికుమార్ హీరోగా నటిస్తున్నాడు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో భారీ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : music maestro  ilayaraja  Sasi kumar  varalaxmi  

Other Articles