Thanu Nenu Movie Release on 27 november

Thanu nenu movie release on 27 november

Thanu Nenu Movie Release on 27 november: Avika Ghor latest film Thanu Nenu. P Rammohan direction. Sunny MR Music. Santhosh Shobhan introduce as a hero. This film will be release on 27 november.

Thanu Nenu Movie Release on 27 november: Avika Ghor latest film Thanu Nenu. P Rammohan direction. Sunny MR Music. Santhosh Shobhan introduce as a hero. This film will be release on 27 november.

ఈనెల 27కే ఫిక్సయిన ‘తను నేను’

Posted: 11/17/2015 10:22 AM IST
Thanu nenu movie release on 27 november

ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘వర్షం’ చిత్రాన్ని అందించిన దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ప్రస్తుతం హీరోగా పరిచయమవుతున్నాడు. సంతోష్ శోభన్, అవికా గోర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తను నేను’. ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌.పి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రమిది.

డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘తను నేను’ షూటింగ్‌ పూర్తయింది. అలాగే ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయనున్నారు.


Video Courtesy : Shreyas Media

బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు ముఖ్య పాత్రలో నటించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని వయాకామ్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయబోతుండగా... తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయనుంది.

అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ లిమిటెడ్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్‌ పి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avika Ghor  Thanu Nenu  Release Date  Theatrical Trailer  Stills  

Other Articles