అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ‘జత కలిసే’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రేపటి దర్శకులు' అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి సినిమాను గ్రాండ్ లెవల్లో డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.
విక్కి, సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 13న హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరితోపాటు రాజా చెయ్యివేస్తే టీమ్, మనమంతా టీమ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారాహి చలన చిత్రం సాయికొర్రపాటి సినిమాను విడుదల చేస్తుండటంత సినిమా రేంజ్ పెరిగింది.
పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, రాజుగారి గది ఫేమ్ విద్యుల్లేఖ రామన్(బుజ్జమ్మ),‘జబర్ దస్త్’ రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మరి కొంత మంది నూతన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: అనంత్ శ్రీరామ్, రెహమాన్, డ్యాన్స్: శేఖర్, గణేష్, విజయ్, ఫైట్స్: జాషువ, ఆర్ట్: జె.కె.మూర్తి, పిఆర్ఓ: వంశి- శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: జగదీష్ చీకటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైది, సంగీతం: విక్కి, సాయికార్తీక్, నిర్మాత: నరేష్ రావూరి, రచన-దర్శకత్వం: రాకేష్ శశి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more