Amy Jackson against tweets on Jallikattu

Amy jackson against tweets on jallikattu

Amy Jackson gets into trouble on Jallikattu, Amy Jackson trouble on Jallikattu, Amy Jackson Jallikattu issue, Amy Jackson against on Jallikattu, Amy Jackson latest news, Amy Jackson latest updates, Amy Jackson movies, Amy Jackson movie updates, Amy Jackson

Amy Jackson against tweets on Jallikattu: Young actress Amy Jackson tweeted that that people should sign the Peta petition against the tradition 'Jallikattu' ban in Tamil Nadu.

రజనీ హీరోయిన్ పై తమిళుల ఆగ్రహం

Posted: 12/21/2015 11:45 AM IST
Amy jackson against tweets on jallikattu

తమిళంలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలను దక్కించుకుంటున్న హాట్ బ్యూటీ అమీ జాక్సన్ కు కోలీవుడ్ జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. అందుకు గల కారణం.. ఈ అమ్మడు తమిళనాడు ప్రజల సాంప్రదాయ క్రీడకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడమే. ఈ అమ్మడు చేసిన ఈ కామెంట్ల వల్ల తాజాగా ఈ అమ్మడికి వచ్చిన ‘2.0‘ మూవీ ఆఫర్ పోయేలా వుంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ అందరికి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ క్రీడను తమిళనాడు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాట ఆందోళనలు మొదలయ్యాయి. కానీ వీరికి వ్యతిరేకంగా కొంతమంది బాలీవుడ్ నటులు మూగజీవాలను హింసించరాదని, కాబట్టి జల్లికట్టుపై నిషేధాన్ని కొనసాగించాలంటూ కామెంట్లు చేసారు. అందుకు అమీజాక్సన్ కూడా మద్ధతు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.

అంతే ఇక అమీజాక్సన్ పై తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు సినిమాలు ఎలా చేస్తుందో చూద్దాం అనే విధంగా తమిళ ప్రజలు అమీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడికి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘2.0’ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నుంచి హీరోయిన్ గా అమీ జాక్సన్ ను తీసేయాలని, లేదంటే సినిమా షూటింగ్ ను అడ్డుకుంటామని, దాడి చేస్తామని వారు బెదిరిస్తున్నారట.

మరి మొత్తానికి ఈ సమస్య తీరాలంటే హీరోయిన్ అమీ జాక్సన్ ను మార్చాల్సిందే లేదంటే తమిళనాడు ప్రజలకు అమీజాక్సన్ క్షమాపణలు చెప్పి, వారికి మద్ధతు ప్రకటిస్తే తప్ప వారి అందోళన తగ్గేట్లుగా కనిపించడంలేదు. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amy Jackson  Jallikattu  tweets  baned  robot2  stills  

Other Articles