B Jaya | Vaishakham | Movie News | stills

B jaya vaishakham movie shooting details

Vaishakham movie shooting updates, Vaishakham movie news, Vaishakham movie updates, Vaishakham movie latest news, B Jaya movies, B Jaya movie updates, B Jaya stills

B Jaya Vaishakham movie shooting details: tollywood lady director B. Jaya birthday special. Her next film title Vaishakham.

ఈనెల్లోనే ‘వైశాఖం’ ప్రారంభం

Posted: 01/11/2016 09:58 AM IST
B jaya vaishakham movie shooting details

చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న దర్శకురాలు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా కొత్త హీరో, హీరోయిన్‌తో 'వైశాఖం' పేరుతో ఓ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించబోతున్నారు. ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై బి.ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా, దర్శకురాలు జయ బి. పుట్టినరోజు జనవరి 11. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''లవ్‌లీ' తర్వాత చాలా గ్యాప్‌ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. జర్నలిస్ట్‌గా వున్నప్పుడు సినిమా రివ్యూస్‌ గురించి రాసేటప్పుడు, ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్‌ని ఇంటర్వ్యూస్‌ చేసేటప్పుడు నాకు మనం కూడా ఒక సినిమా తియ్యాలని ఉండేది. అది ఎలాంటి సినిమా? ఏంటి? అనేది కాకుండా మెయిన్‌గా ఏదో ఒక సినిమా తియ్యాలని మాత్రం మెయిన్‌ ఉండేది. ఆ ఆలోచనలో 'ప్రేమలో పావని కళ్యాణ్‌' తీసాం. ఆ ప్రాసెస్‌లో ఛాలెంజింగ్‌ ఫిలింస్‌ తీసాను. ఆ రోజుల్లో 'చంటిగాడు' పెద్ద సక్సెస్‌ అయ్యింది. అలాగే 'లవ్‌లీ' కూడా చాలా పెద్ద సక్సెస్‌ అయ్యింది. ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్‌కి డబ్బింగ్‌ అయ్యింది. కోల్‌కత్తా, బెంగాలీ రెండు బెంగాలీ భాషల్లో రీమేక్‌ అయ్యింది. ఇంత చిన్న సినిమా ఇండియా వైజ్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందడం అనేది చాలా రేర్‌. ఆదిత్యవారు 'లవ్‌లీ'ని హిందీలో డబ్‌ చేసి యూ ట్యూబ్‌లో పెడితే 2 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి అంటే అది సామాన్యమైన విషయం కాదు. నాకు 'లవ్‌లీ' డైరెక్టర్‌'గా ఒక రేంజ్‌ ఆఫ్‌ ఎఛీవ్‌మెంట్‌ని ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక మంచి సినిమా తియ్యాలి. ఒక రిఫరెన్స్‌లా వుండే ఫిల్మ్‌ తియ్యాలి అని ఒక మంచి కథ రెడీ చేసాం. అదే 'వైశాఖం'. జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని జ్ఞాపకాలు వుంటాయి. అమ్మ చేతి గోరు ముద్దలు, నాన్న చెయ్యి పట్టుకొని నడిచిన క్షణాలు. ఇవన్నీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అట్లాంటి ఒక ఫీల్‌గుడ్‌ ఫిలిం తియ్యాలి. రొటీన్‌గా, జనరల్‌గా మనకు తెల్సిన ఫిల్మ్‌ తీయకూడదు. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యాలి. ప్రతి క్యారెక్టర్‌ మనసుని హత్తుకునేలా వుండాలి. ఫలానా ఆర్టిస్ట్‌ భలే చేసాడే అనేలా వుండాలి. ఇలా అన్ని కోణాల్లో లోతుగా ఆలోచించి పక్కా బౌండ్‌ స్క్రిప్ట్‌తో రెడీ చేసుకున్న కథ 'వైశాఖం'. ప్రతి ఒక్కరికీ హండ్రెడ్‌ పర్సెంట్‌ నచ్చేలా కథ రెడీ చేసాం.

హీరో, హీరోయిన్లుగా కొత్తవాళ్ళు యాక్ట్‌ చేస్తున్నారు. మిగతా ఆర్టిస్ట్‌లందరూ సీనియర్‌ యాక్టర్స్‌ వుంటారు. ఫస్ట్‌ నుండీ నేను న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యాలని తాపత్రయపడుతుంటాను. ఒక్క ఛాన్స్‌ వస్తే చాలు మమ్మల్ని మేం నిరూపించుకుంటాం అనే వారు చాలామంది ఉన్నారు. ఆల్‌రెడీ సక్సెస్‌ అయినవారికి మనం ఛాన్స్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఈ సినిమాతో దాదాపు 6,7 మంది కొత్త ఆర్టిస్ట్‌ల్ని పరిచయం చేస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే స్పూఫ్‌లతో కాకుండా కొత్తగా, సహజంగా ఉండేటట్లు ఉంటుంది. జనవరిలోనే ఈ సినిమా ప్రారంభిస్తున్నాం. సిటీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. అందరికీ నచ్చే ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం. 'వైశాఖం' లాంటి ఒక మంచి సినిమా తీసారు అని అందరి ప్రశంసలు అందుకోవాలనే తాపత్రయంతో చాలా గ్యాప్‌ తీసుకొని ఈ సినిమాని తీస్తున్నాం. షార్ట్‌ ఫిలింస్‌కి అవార్డ్స్‌ ఇవ్వడం, షార్ట్‌ ఫిలింస్‌ డైరెక్టర్స్‌ని ఎంకరేజ్‌ చేస్తాం. ఆర్టిస్ట్‌ల్ని, టెక్నీషియన్స్‌ని మా సినిమాల్లో కూడా తీసుకొని వారికి ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చే ఆలోచన ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : B Jaya  Vaishakham  Movie News  stills  

Other Articles