Nagarjuna | interview | Soggade Chinni Nayana | Delay | Postponed | stills

Nagarjuna soggade chinni nayana release delay

Soggade Chinni Nayana Release Delay, Soggade Chinni Nayana postponed, Soggade Chinni Nayana latest news, Nagarjuna latest interview, Nagarjuna Soggade Chinni Nayana interview, Soggade Chinni Nayana movie updates, Soggade Chinni Nayana release date, Soggade Chinni Nayana

Nagarjuna Soggade Chinni Nayana Release Delay: Akkineni Nagarjuna latest film Soggade Chinni Nayana. Ramya Krishnan, Lavanya Tripati heroines. This film Release Delayed.

‘సొగ్గాడే చిన్ని నాయనా’ను వాయిదా వేస్తాడట

Posted: 01/11/2016 12:59 PM IST
Nagarjuna soggade chinni nayana release delay

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సొగ్గాడు చిన్ని నాయనా’ చిత్రం విడుదలకు సిద్ధంగా వున్న విషయం తెలిసిందే. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 15న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా విడుదలను వాయిదా వేసే పనిలో వున్నాడు చిత్ర నిర్మాత నాగార్జున.

సంక్రాంతి కానుకగా జనవరి 13న ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, జనవరి 14న బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలు విడుదలవుతున్నాయి. అలాగే జనవరి 15న శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలు తమ విడుదల విషయంలో ఎలాంటి వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేవు. దీనివల్ల సినిమాకు కలెక్షన్ల నష్టం వాటిల్లుతుందనే విషయం తెలిసినప్పటికీ.. విడుదల విషయంలో ఎలాంటి వెనుకంజ వేయకుండా.. అనుకున్న రోజునే సినిమాను విడుదల చేయబోతున్నారు.

కానీ నాగార్జున మాత్రం తన ‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విడుదలను వాయిదా వేసేందుకు సిద్ధంగా వున్నారు. ప్రస్తుతం ‘సొగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో నాగార్జున బిజీగా వున్నారు. ఈ సంధర్భంగా పలు మీడియా ఇంటర్వ్యూలతో మాట్లాడుతూ థియేటర్ల సమస్య గురించి స్పందించారు. సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలవుతుండటం వల్ల థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. అయితే సాధారణంగా నా సినిమాను దాదాపు 600ల థియేటర్లలో వేస్తుంటాం. కానీ ఇపుడు ‘సొగ్గాడే చిన్ని నాయనాకు’కు కేవలం 500 వరకు థియేటర్లు మాత్రమే దొరికాయి. ఇంకొన్ని రావోచ్చేమోనని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా.. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని రెండున్నర నెలల కిందటే ఫిక్సయ్యాం. అప్పుడే థియేటర్ల బుకింగ్ కూడా అయిపోయింది. పెద్ద నగరాలు, పట్టణాలలో థియేటర్లు దొరికాయి కానీ, చిన్న సెంటర్లలో బుకింగ్ ఇంకా జరగలేదు. అలాంటి చోట్ల థియేటర్లు దొరికితే ఈనెల 15న విడుదల చేస్తాం. లేదంటే ఓ వారం రోజులు ఆగి, ఆ తర్వాత విడుదల చేస్తాం. మా సినిమా ఎప్పుడు విడుదలయిన కూడా జనం ఆదరిస్తారనే నమ్మకం వుంది. కాబట్టి ఎప్పుడొచ్చినా కూడా నష్టమేం లేదు అని నాగార్జున స్పష్టం చేసాడు.

నాగార్జున చెప్పిన ప్రకారం చూస్తుంటే ‘సొగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కాకుండా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నాగార్జున ఓ వారం రోజులు ఈ సినిమా వాయిదా వేయడమే బెటర్ అని సినీవర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  interview  Soggade Chinni Nayana  Delay  Postponed  stills  

Other Articles