Balakrishna | Competition | Dictator | Platinum Disc Function Speech

Balakrishna speech in dictator platinum disc function

Balakrishna talks about his Competition, Balakrishna in Dictator Platinum Disc Function, Balakrishna clarifies on Competition, Balakrishna latest speech, Balakrishna latest news, Balakrishna news, Balakrishna speech, Balakrishna latest hot news, Balakrishna, Dictator

Balakrishna speech in Dictator Platinum Disc Function: Nandamuri Balakrishna latest film Dictator will be release on 14 january. Sriwaas director, Thaman music.

వాళ్లిద్దరూ తప్ప తనకెవరూ పోటీ లేరంటున్న డిక్టేటర్

Posted: 01/11/2016 11:24 AM IST
Balakrishna speech in dictator platinum disc function

నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య గతకొద్ది కాలంగా ‘కోల్డ్ వార్’ నడుస్తోందని వార్తలొస్తున్నాయి. అయితే వార్తలు ఈమధ్య మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే బాలకృష్ణ నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. బాలయ్యకు పోటీగా ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా, ‘డిక్టేటర్’ చిత్రం విడుదల రోజు కంటే ఒకరోజు ముందుగా అంటే జనవరి 13వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో.. బాలయ్య-ఎన్టీఆర్ ల మధ్య ‘కోల్డ్ వార్’ నడుస్తుందని తెలుగు ప్రేక్షకులు కన్ఫర్మ్ చేసుకున్నారు.

గతంలో ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల విడుదల విషయంలో ఎలాంటి బంధుత్వం లేని స్టార్ హీరోలు సైతం ఒకరికోసం ఒకరు తమ సినిమాల విడుదల తేదిని వారం రోజుల పాటు వాయిదా వేసుకొని, ఒకరిపై ఒకరికి వున్న తమ స్నేహాభావాన్ని చూపించారు. కానీ ఈ బాబాయ్-అబ్బాయిలు మాత్రం తమ సినిమాలను ఒకేసారి సంక్రాంతి బరిలోకి దించేస్తున్నారు. రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో రూపొందినవే. పైగా ఈ రెండు సినిమాలు కూడా నందమూరి హీరోలవే కావడంతో ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాలు హాట్ టాపిక్ గా మారాయి.


TFPC

అయితే బాలయ్య మాత్రం తనకు తానే పోటీ అని, తన సినిమాకు ఎవరి సినిమాలు పోటీకావంటూ బహిరంగంగా ప్రకటించేసాడు. తాజాగా ఆయన ‘డిక్టేటర్’ ఆడియో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ... నాకెప్పుడూ నా సినిమాలే పోటి. నేను వేరే వాళ్ల గురించి ఆలోచించను. ఇంకెవరైనా పోటీ వుంటే ముందుముందు నటిస్తాను. నేనున్నాను.. నా అబ్బాయి, నా మనవడు వున్నాడు. ఇక నాకెవరూ లేరు పోటీ. అది మాత్రం నూటికి నూరుపాళ్లు ఖాయం అని ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

అయితే ఇందులో బాలయ్య చెప్పిన అబ్బాయి నందమూరి మోక్షజ్ఞ గురించి చెప్పాడా లేక ఎన్టీఆర్ ను ఉద్దేశించి చెప్పాడా అనే అనుమానం మొదలయ్యింది. మొత్తానికి తనకు వేరే వాళ్లు ఎవరూ లేరని చెప్పడంతో ఎన్టీఆర్-బాలయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత కోల్డ్ వార్ నడుస్తోందని సినీవర్గాల వారు చర్చించుకుంటున్నారు. మరి భవిష్యత్తులోనైనా వీరిద్దరూ కలిసిపోవాలని, మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Competition  Speech  Dictator Platinum Disc Function  

Other Articles