సుప్రసిద్ధ సీనియర్ దర్శకులు రవిరాజా పినిశెట్టి ఆదర్శ చిత్రాలయ పై లిమిటెడ్ బ్యానర్ పై పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో రెండవ కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలుపు' చిత్రం ఫిబ్రవరి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రవిరాజా పినిశెట్టి చెబుతూ "క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి గీతా ఫిల్మ్ డిస్టిబూషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. విదేశాలలో దర్శకత్వ శాఖలో మరియు టెక్నికల్‌గా శిక్షణ పొందివచ్చిన నా పెద్ద కుమారుడు సత్యప్రభాస్ ఈ చిత్రాన్ని అద్భుతమైన రీతిలో చిత్రీకరించారు. టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం అనూహ్యమైన రీతిలో ఉంటుందని అంటుంది. "రుక్మిణి' చిత్రం తరువాత నేరుగా నిర్మించిన తెలుగు చిత్రమిది" అన్నారు.
చిత్ర దర్శకులు సత్య ప్రభాస్ మాట్లాడుతూ "నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తయారు చేసుకున్న కథ ఈ మలుపు. చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడికి కొత్త తరహాగా మలుపులుతో కథ కొనసాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో న్యూయిర్ సందర్భంగా డిసెంబరు 31వ తేదీ రాత్రి ఏం జరిగిందనే కీలక సన్నివేశం ఈ సినిమాలో ఓ హైలైట్‌గా నిలుస్తుంది" అన్నారు.
చిత్ర కథానాయకుడు ఆది మాట్లాడుతూ "అన్నయ్య డైరెక్షన్, నాన్నగారి బ్యానర్లో వర్క్ చేయడం మంచి అనుభూతిగా చెప్పొచ్చు. నా గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమది. నటుడిగా నాకు గతంలో తెలుగులో వచ్చిన వైశాలి కంటే పెద్ద హిట్ ఈ సినిమా అవుతుందనే నమ్మకుముంది" అన్నారు.
హీరో ఆది పినిశెట్టి ఒక పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో మిథున చక్రవర్తి, (గోపాల గోపాల ఫేమ్) నికిగల్రాణి, రిచాపల్లోడ్, పశుపతి, ప్రగతి, నాజర్, కిట్టి, హరీష్ ఉత్తమన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్, ప్రవీణ్, శ్యామ్, ఫోటోగ్రఫీ: షన్మగ సుందరం, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భువన చంద్ర, నిర్మాత: రవిరాజా పినిశెట్టి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more