Garam | Aadi | Release Date | Adah Sharma | Trailers

Garam movie release on 12 february

Garam Movie Release on 12 February, Garam Movie press meet, Garam Movie trailers, Garam Movie songs, Garam Movie stills, Garam Movie posters, Aadi Garam, Adah sharma latest stills

Garam Movie Release on 12 February: Aadi, Adah Sharma latest film Garam. madan director. This film will be release on 12 feb.

ఫిబ్రవరి 12న ‘గరం’ విడుదల

Posted: 02/10/2016 11:05 AM IST
Garam movie release on 12 february

ఆది హీరోగా, శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'.ఇందులో అదా శర్మ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సాయికుమార్, మదన్, హీరో ఆది, ఆదాశర్మ, తనికెళ్ళభరణి, నాజర్, పోసాని, పృథ్వీ, శ్రీనివాస్ గవిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘మా ‘గరం’ మూవీ ఫిబ్రవరి 12న విడుదలవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మదన్‌ చాలా బాగా డైరెక్ట్‌ చేశాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఫీల్‌ గుడ్‌ మూవీ. ఆది డ్యాన్సు, ఫైట్స్‌ బాగా చేశాడు. యు.ఎస్‌లో కూడా సినిమా పెద్ద రేంజ్‌లో విడుదలవుతుంది. అగస్త్య చాలా మంచి మ్యూజిక్‌ అందించాడు. మంచి సోల్‌ ఉన్న మూవీ. మంచి ఫ్యామిలీ డ్రామా. మంచి ఆర్టిస్టు, టెక్నిషియన్స్‌ వర్క్‌ చేశారు. ఆదాశర్మ చాలా చక్కగా నటించింది. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ ‘’సినిమా చక్కగా వచ్చింది. ఈ సినిమాలో నాజర్, పోసాని, తనికెళ్ళభరణిగారు, సీనియర్ నరేష్ గారు ఇలా సీనియర్ ఆర్టిస్ట్స్ లతో కలిసి పనిచేయడం చాలా హ్యపీగా ఉంది. మంచి ఎక్స్ పీరియెన్స్. సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అందరికీ నచ్చుతుంది. ఎవరూ డిసప్పాయింట్ అవరు’’ అన్నారు.

దర్శకుడు మదన్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో తనికెళ్ళభరణిగారు, పోసాని వంటి రచయితలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. మంచి కమర్షియల్ టైటిల్ అని పెట్టాం. నా దృష్టిలో సినిమా హిట్ అని భావిస్తాను. సాయికుమార్ గారు దర్శకుడిగా నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ ను రాబట్టుకున్నారు. ఆది, ఆదాశర్మ చక్కగా నటించారు. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ ‘’కొత్త పాయింట్ ను చక్కగా ట్రీట్ చేశాం. మంచి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మదన్ గారి స్టయిల్ రిలేషన్స్ పై సాగుతుంది. ఆది సరికొత్తగా కనపడతాడు. సినిమాను పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

బ్ర‌హ్మానందం, న‌రేష్ , త‌నికెళ్ళ భ‌ర‌ణి, నాజ‌ర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, చైత‌న్య కృష్ణ‌, క‌బీర్ సింగ్‌, సుప్రీత్‌, స‌త్యప్ర‌కాష్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, పృథ్వి, మ‌ధునంద‌న్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌, దిల్ ర‌మేష్‌, సుమ‌న్ శెట్టి, అదుర్స్ ర‌ఘు, మారుతి, అర‌వింద్‌, శివ‌న్నారాయ‌ణ‌, వేణుగోపాల్‌రావు, విన‌య ప్ర‌సాద్‌, శ్రీల‌క్ష్మి, అనిత చౌద‌రి, జ‌య‌వాణి, అపూర్వ‌, ఎస్త‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు క‌థ‌-మాట‌లు: శ‌్రీనివాస్ గ‌విరెడ్డి, పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల‌, చైతన్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి, పుల‌గం చిన్నారాయ‌ణ‌, పీఆర్వో: పుల‌గం చిన్నారాయ‌ణ‌, కొరియోగ్ర‌ఫీ: శేఖ‌ర్‌, జానీ, విద్యాసాగ‌ర్‌, ఫైట్స్: థ‌్రిల్ల‌ర్ మంజు, వెంకట్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: జి.హ‌రికృష్ణ‌, ఎడిట‌ర్‌: కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్: టి.ఎన్. ప్ర‌సాద్‌, కెమెరా: టి.సురేంద్ర‌రెడ్డి, సంగీతం: అగ‌స్త్య‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: బాబ్జీ, నిర్మాత‌: పి.సురేఖ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: మ‌ద‌న్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadi  Garam  Release Date  Adah Sharma  Trailers  

Other Articles