Nayanthara | Horror Film | Movie News | Stills

Nayanthara latest horror film updates

Nayanthara Horror Films, Nayanthara latest film updates, Nayanthara stills, Nayanthara movie news, Nayanthara movie updates, Nayanthara stills, Nayanthara news

Nayanthara latest Horror film updates: Tamil star heroine Nayanthara doing a horror film after Mayuri.

దీనిని మించిన హర్రర్ సినిమా వుండదు

Posted: 02/29/2016 01:12 PM IST
Nayanthara latest horror film updates

ఈ చిత్రం భయపెట్టేటట్లుగా సమీప భవిష్యత్తులో మరే చిత్రం భయపెట్టలేదేమో. ఈ చిత్రం తర్వాత మరో హారర్ సినిమా నేను వెంటనే చేయకపోవచ్చు" అంటోంది నయనతార. "మయూరి" చిత్రంతో ఒక మోస్తరుగా భయపెట్టిన ఈ అందాల రాక్షసి ఇంకా పేరు పెట్టని తన తాజా చిత్రంతో మరింత భయపెడతానని భరోసా ఇస్తోంది. అవుట్ అండ్ అవుట్ హారర్ ఎంటర్ టైనర్ గా.. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

మానస్ రుషి ఎంటర్ ప్రైజస్ పతాకంపై కె. రోహిత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సజ్జూభాయ్-రాంప్రసాద్ సహ నిర్మాతలు. "నయనతార కెరీర్ లో కలికితురాయిగా నిలిచే చిత్రమిది. గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యముంటుంది" అని నిర్మాత కె.రోహిత్ అన్నారు.

తంబిరామయ్య, హరీష్ ఉత్తమన్, మన్సూర్ ఆలీఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్లిన్, చాయాగ్రహణం: దినేష్ కృష్ణన్, ఎడిటింగ్: గోపికృష్ణ, సహ నిర్మాతలు: సజ్జూభాయ్-రాంప్రసాద్, నిర్మాత: కె. రోహిత్, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: మురుగదాస్ రామస్వామి!!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Horror  Film Update  stills  

Other Articles