Express Raja | 50 Days Completed | Sharwanand | Surabhi

Express raja film completes 50 days

Express Raja 50 Days Completed, Express Raja Collections, Express Raja Movie, Express Raja Movie Trailers, Express Raja Songs, Express Raja Videos, Express Raja Comedy, Express Raja Interviews

Express Raja Film Completes 50 Days: Telugu actor Shrawanand latest hit film Express Raja. This film Completed 50 Days. Merlapaka gandhi direction.

50రోజులు పూర్తిచేసుకున్న ‘ఎక్స్ ప్రెస్ రాజా’

Posted: 03/04/2016 09:18 AM IST
Express raja film completes 50 days

శర్వానంద్, సుర‌భి హీరోహీరోయిన్లుగా యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో మేర్లపాక గాంధి ద‌ర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ సినిమా విడుద‌ల‌రోజు నుండి పాజిటివ్ టాక్ తో పాటు, శ‌ర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ రెవిన్యూ తో సూప‌ర్బ్ క‌లెక్ష‌న్ల‌తో 50 రోజులు పూర్తిచేసుకుంది. స‌ంక్రాంతి బ‌రిలో భారీ కాంపిటేష‌న్ తో విడుద‌ల‌య్యి మొద‌టి లాభాలు తెచ్చుకున్న చిత్రంగా ముందొర‌స‌లో వుండ‌ట‌మే కాకుండా ఎక్స్ ప్రెస్ క‌లెక్ష‌న్ల‌తో 50 రోజుల పండ‌గ‌ని పూర్తిచేసుకుంది. సంక్రాంతికి పూర్తి వినోదంతో వ‌చ్చిన చిత్రంగా ఫ్యామిలి ఆడియ‌న్స్ ఈ ఘ‌న‌విజ‌యాన్ని అందించారు. 50 రోజుల విజ‌య‌వంతంగా ఆదరించిన తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి చిత్ర యూనిట్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ... ద‌ర్శ‌కుడు మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచ‌నాలు అందుకున్నారు. అంతేకాకుండా స్క్రీన్‌ప్లే కొత్త‌గా వుండ‌టంతో ఆడియ‌న్స్ థ్రిల్ ఫీల‌య్యారు. మెద‌టి 10 నిమిషాలు సినిమా మిస్ కాకూడ‌ద‌ని ముందునుండి చెప్పుకుంటూ వ‌చ్చారు. అలానే చిత్రంలో కూడా మొద‌టి ప‌ది నిమిషాలు కీ రోల్ ప్లే చేయ‌టం ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు లో రాలేదని చెప్ప‌టం విశేషం. శ‌ర్వానంద్ స్టైల్ అండ్ ఫెర్‌ఫార్మ్‌న్స్ చాలా కొత్త‌గా వుంది. సుర‌భి న‌ట‌న అందం చాలా ప్ల‌స్ అయ్యాయి. అలాగే స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్‌, ధ‌న‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌రియు బ్రహ్మాజిల పాత్రల పేర్లే చిత్రంలో చ‌క్కిలిగింత‌లు పెట్టాయి. సినిమా కి హైలెట్ కామెడి అని చెప్పుకోవాలి. ఫ్యామిలి అంతా చూసి మా ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాన్ని దిగ్విజ‌యంగా 50 రోజులు ఆద‌రించినందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌ని మా ధ‌న్య‌వాదాలు అని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Express Raja  50days  Sharwanand  Movie stills  

Other Articles