Producer | Bellamkonda Suresh | Office seized | Bellamkonda srinivas

Producer bellamkonda suresh office seized

Bellamkonda Suresh Office seized, Bellamkonda Office seized, Bellamkonda Suresh Office Locked, Bellamkonda Suresh news, Bellamkonda Suresh movies, Bellamkonda Suresh loss, Bellamkonda Suresh latest news, Bellamkonda Suresh stills

Producer Bellamkonda Suresh Office seized: Officials of the Kotak Mahendra Bank seized the office of noted film producer Bellamkonda Suresh over non-payment of loans.

బెల్లంకొండ సురేష్ ఆఫీస్ సీజ్

Posted: 03/04/2016 11:23 AM IST
Producer bellamkonda suresh office seized

ఒకప్పుడు వరుస హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు గతకొద్ది కాలంగా ఒక్క విజయం కూడా దక్కడం లేదు. దీంతో సినిమాల కోసం చేసిన అప్పులు, వడ్డీలు ఎక్కువయ్యాయి. పరిస్థితి చేజారడంతో బెల్లంకొండ సురేష్ కార్యాలయాన్ని బ్యాంక్ అధికారులు సీజ్ చేసేసారు.

కొటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి బెల్లంకొండ సురేష్ తీసుకున్న 11కోట్ల వరకు రుణం చెల్లించని కారణంగా.. ఫిల్మ్ నగర్ లోని ఆయన ఆఫీస్ ను నిన్న సీజ్ చేసారు. దీంతో బెల్లంకొండ సురేష్ కు ఊహించలేని దెబ్బ తగిలిందని భావించవచ్చు. తన కొడుకు శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేస్తూ భారీ బడ్జెట్ ‘అల్లుడు శ్రీను’ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా కోసం సురేష్ భారీగా ఖర్చు పెట్టారు. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాతో దాదాపు 15 కోట్ల వరకు నష్టపోయినట్లుగా తెలిసింది. ఇదే కాకుండా మిగతా సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగి, పూర్తిగా నష్టాల్లో మునిగిపోవడంతో... బ్యాంక్ అధికారులు బెల్లంకొండ ఆఫీస్ ను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bellamkonda Suresh  Office Seized  Stills  Bellamkonda srinivas  

Other Articles