Shruti Haasan's Facebook account hacked

Shruti facebook account hacked

Shruti Hassan, Shruti Hassan Facebook, Shruti Hassan Facebook Hacked, Shruti Hassan Twitter, Kriti Sanon, Mahesh Babu, Premam, Rocky Handsome

Shruti Hassan joins the list of actresses whose social networking accounts have been hacked as her Facebook account has been hacked

అమ్మడి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకయ్యింది..

Posted: 03/07/2016 07:41 AM IST
Shruti facebook account hacked


అభిమానులతో నిత్యం టచ్ లో వుండేందుకు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అకౌంట్లను ఆశ్రయిస్తుండగా, వారికి కూడా కష్టాలు తప్పటం లేదు. పెరుగుతున్న సాంకేతికతతో అభిమానులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్న తారలకు సోషల్ మీడియాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ప్రముఖుల సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ కూడా హ్యాకర్స్ బారిన పడగా.., తాజాగా శృతిహాసన్ ఫేస్బుక్ ఎకౌంట్ కూడా ఈ జాబితాలో చేరింద.

అయితే శృతి పేజ్పై అభ్యంతరకరంగా ఎలాంటి పోస్ట్లు పెట్టకపోయినా, మరో హీరోయిన్ కృతి సనన్, తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలను శృతి ఫేస్ బుక్ పేజ్లో పోస్ట్ అయ్యాయి. దీంతో ఎలర్ట్ అయిన శృతి టెక్నికల్ టీం, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించిన శృతిహాసన్, 'కొంత మంది హ్యాకర్స్ నా ఫేస్బుక్ ఎకౌంట్ ను హ్యాక్ చేశారు. ప్రస్తుతం దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాం. అప్పటి వరకు నా ఎకౌంట్లో వచ్చే పోస్ట్లను పట్టించుకోకండి' అంటూ ట్వీట్ చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  facebook  Hacked  

Other Articles