Happy Birthday Ram Charan: Fans to create a new world record on their idols special day?

Happy birthday ram charan teja fighter 31

happy birthday ram charan, ram charan, ram charan 31, ram charan blood donation, ram charan teja, ram charan teja birthday, mega power star, tollywood, ram charan next film, ram charan tweets

Ram Charan Teja is the brightest star in the Telugu film firmament filled with family constellations.

హ్యాపీ బర్త్ డే టు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్

Posted: 03/27/2016 10:04 AM IST
Happy birthday ram charan teja fighter 31

నటన తన ఇంటిపేరు.. డాన్సులు తన రక్తం.. అభినయం ఆయన ఊపిరి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన తండ్రి సినిమాలు క్రీయేట్ చేస్తున్న రికార్డులను చూస్తూ.. చాలా మంది అభిమానుల్లో ఒకడిగా తన తండ్రి డాన్సులు, నటన తన గదిలో ప్రాక్టీసు చేస్తూ చిన్నతనం నుంచి అలాగే పెరిగాడు. ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. నటన పట్ల ఆయనకున్న అభిరుచి గమనించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘చిరుత’ సినిమాతో 2007లో తెరంగేట్రం చేయించారు.

తొలి చిత్రంతోనే తన నటనకు గానూ ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’లో నటించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతంచేసుకున్నారు చరణ్. ఆ తరువాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమా ‘ఆరెంజ్’ లో నటించారు. ఆ సినిమా హిట్ కాకపోయినా చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఆ తరువాత రచ్చ, నాయక్, ఎవడు, తుఫాన్(జంజీర్ రీమేక్), గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈరోజు చరణ్ తన 31వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు ‘గ్లోబల్ మెగా బ్లడ్ డొనేషన్ ఈవెంట్’ ను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో భారీగా చారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ సోషల్ మీడియా ఫ్యాన్స్ అయితే తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలను ఎన్నుకుని అక్కడ చారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సాధారణంగా నిర్వహించే రక్తదాన కార్యక్రమంతో పాటు వైజాగ్, కర్నూల్, బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూర్, ఖమ్మం, అనంతపురం, తాడేపల్లి గూడెం, చిత్తూరు వంటి ప్రాంతాల్లో కేక్ కటింగ్ ఫంక్షన్లు అనాధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర దేశాల్లోని అభిమానులు కూడా భారీ ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం. అభిమానులు చేస్తున్న ప్రయత్నానికి చిరంజీవి అభినందనలు తెలిపారు. రామ్ చరణ్ ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. బర్త్ డే బాయ్ రామ్ చరణ్ కు మనమూ హర్థి్క జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  ram charan teja birthday  mega power star  tollywood  

Other Articles