Jim Carrey delights waitress with USD 225 tip

Jim carrey leaves generous tip for waiter

jim carrey, jim carrey news, jim carrey latest news, gansevoort hotel, jim carrey movies, jim carrey upcoming movies, entertainment news

Jim Carrey left a waitress a USD 225 tip during an evening out in New York City.

టిఫ్ తొ తన సహృదయాన్ని చాటుకున్న నటుడు

Posted: 04/09/2016 05:47 PM IST
Jim carrey leaves generous tip for waiter

హోటల్‌లో రుచికరమైన వంటకాలు వడ్డించే వెయిటర్లకు టిప్‌ ఇవ్వడం సర్వసాధారణమే. కానీ హాలీవుడ్‌ హీరో జిమ్‌ క్యారీ ఓ మహిళా వెయిటర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆమెకు ఏకంగా 224 డాలర్లు (రూ. 15వేలు) టిప్‌గా ఇచ్చాడు. 'లయర్ లయర్‌', 'ద మాస్క్‌' వంటి చిత్రాల్లో నటించిన ఈ 53 ఏళ్ల నటుడు న్యూయార్క్ సిటీలో స్నేహితులతో కలిసి జల్సా చేశాడు. మిట్‌ప్యాకింగ్‌ జిల్లాలోని ప్రముఖ చెస్టర్ రెస్టారెంట్‌లో మిత్రులకు పార్టీ ఇచ్చాడు. సంప్రదాయ అమెరికన్ ఆహారం అందించడంలో పేరొందిన ఈ రెస్టారెంట్‌లో పాయింట్‌ నాయిర్‌ వైన్‌, లెమన్ చికెన్.. తదితర రుచికరమైన వంటలతో ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా మంచి మూడ్‌లో ఉన్న ఆయన మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారని, వెయిట్రెస్‌కు 224 డాలర్ల టిప్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ విందులో స్నేహితులతో ఆయన చాలా సంతోషంగా గడిపారని న్యూయార్క్ పోస్టు తెలిపింది. గేన్స్‌వూర్ట్‌ హోటల్‌ లో భాగమైన ఈ రెస్టారెంట్‌లో వెయిటర్లకు జీతం కన్నా టిప్పే అధికంగా లభిస్తుందని చెప్తున్నారు. గతంలోనూ చాలామంది సెలబ్రిటీలు ఇక్కడ వెయిటర్లకు భారీగా టిప్‌ ఇచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jim Carrey  hollywood  waitress  USD 225 tip  

Other Articles