నందమూరి బాలకృష్ణ చేయబోయే 100వ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దుమ్మురేపుతున్న బాలయ్య ఇప్పటివరకు 99 చిత్రాలను పూర్తిచేసుకున్నారు. అలాంటి బాలయ్య చేయబోయే 100వ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాంటి 100వ సినిమా దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్దురుమ్, కంచె వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ ను సొంతం చేసుకున్న దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 100వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనే టైటిల్ ను ఖరారు చేసి, ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు.
అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, గ్రాఫిక్స్ వండర్ గా రూపొందించాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. ఈ విషయాలను దర్శకుడు క్రిష్ స్వయంగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రిష్ మాట్లాడుతూ... గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఒక గొప్ప వీరుడి కథ. భారతదేశం అనే రాజ్యాన్ని తయారుచేసిన వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఇలాంటి వ్యక్తి కథను బాలయ్య గారి దగ్గరకు తీసుకెళ్లేసరికి.. ఆయనకు బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని చెప్పుకొచ్చారు.
‘బాహుబలి’ సినిమాను చూసిన కళ్లతో నా సినిమాను ప్రేక్షకులు చూడాలి. అందుకే ఆ రేంజిని అందుకునే ప్రయత్నం చేస్తాను. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చాలామందికి తెలీదు కాబట్టి ఈ కథను డీల్ చేయాలంటే పెద్ద చాలెంజ్. అదేవిధంగా జనాలకు తెలీకపోవడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే తెలుసుకోవాలనే కుతూహలం పుడుతుంది కదా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని విజువల్ గ్రాండ్‌గా తెరకెక్కిస్తాను. ఈ చిత్రం కేవలం బాలయ్య అభిమానులకే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకులంతా కూడా చక్కని సినిమా అని గర్వంగా చెప్పుకునే విధంగా తీయాలని వుంది అని క్రిష్ చెప్పుకొచ్చాడు.
‘‘శాతకర్ణి ఒక యుగ పురుషుడు. నేను బాలకృష్ణగారికి కథ చెప్పినప్పుడు ఆయన ముఖకవళికల్లో కనిపించిన మార్పులతో ఇప్పటికే నేను సినిమా చూసేశాననే భావన కలుగుతోంది. ‘నా కత్తి కంటే నెత్తుటి చుక్క ఇంకా పచ్చిగా ఉంది’ వంటి డైలాగులు ఇందులో ఉంటాయి. శాతవాహనుల చరిత్రతో బాలయ్య శత చిత్ర నిర్మాణం చేసే అదృష్టం నాకు లభించింది. ఇంతకంటే కమర్షియల్ స్టోరీ నాకు తెలియదు. మే మొదటి వారంలో మొరాకోలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం అని క్రిష్ తెలియజేసాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more