సాయిధరమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వం లో శిరీష్ నిర్మించిన చిత్రం 'సుప్రీమ్'. మే 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ హజరయ్యారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సాయిధరమ్ తేజ్, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, రాశిఖన్నా, వెన్నెలకిషోర్, పృథ్వీ, ప్రభాస్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరాం తదితరులు హజరయ్యారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... మెగాభిమానుల సపోర్ట్ తోనే సుప్రీమ్ పెద్ద హిట్టయ్యింది. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. సబ్జెక్ట్ ను నమ్మి సినిమాను ప్రొడ్యూస్ చేశారు. బాలు అనే అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ గారికి థాంక్స్. ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ వల్లే చాలా బాగా చేయగలిగాను. నాకు, రాజేంద్రప్రసాద్ గారికి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్, నాకు, మికెల్ కు మధ్య వచ్చే సీన్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే వెన్నెలకిషోర్, రాశిఖన్నాల మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడంతో వారి మధ్య కామడి బాగా వచ్చింది అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ... సుప్రీమ్ సక్సెస్ లో సాయిధరమ్ తేజ్, అనిల్ ముఖ్య కారణమైనప్పటికీ వారితో పాటు మికెల్ గాంధీ నటన, క్లైమాక్స్ ఫిజికల్ చాలెంజ్ వ్యక్తులు చేసిన ఫైట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి వారితో పాటు రాజేంద్రప్రసాద్, సాయికుమార్ సహా ప్రభాస్ శ్రీను, పృథ్వీ, పోసాని, శ్రీనివాస్ రెడ్డి, రాశిఖన్నా అందరి సపోర్ట్ తోనే సినిమా బాగా వచ్చింది. చివర్లో వచ్చే ఫిజికల్లీ చాలెంజ్డ్ వక్తులు ఫైట్ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అనిల్ రావిపూడి ఇలాంటి సన్నివేశంతో ఓ మెసేజ్ ను కూడా ఇచ్చాడు. సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.... ఈ సినిమాలో వర్క్ చేసిన అందరూ ప్రేమతో చేయడం వల్లనే ఇంత పెద్ద సక్సెస్ వీలైంది. ఈ సినిమాను రామాయణం నుండి ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చేశాం. రాముడు మికెల్ అయితే, హనుమగా సాయిధరమ్ తేజ్ నటించాడు. మిగిలిన నటీనటులందరూ వానరసైన్యంలా సపోర్ట్ చేశారు. ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్ తో ఫైట్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఎంతో ఎమోషన్ ఫీలయ్యాను. అలాగే ఎగ్జయిట్ మెంట్ తో సినిమా చేశాను. రాజేంద్రప్రసాద్ గారు నాకేంతో ఇష్టమైన హీరో. జంధ్యాల, రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూడకుండా ఉండుంటే నేను నా సినిమాల్లో ఇంత మంచి కామెడిని చేసే చేయగలిగేవాడిని కాను. అలాగే నా వెల్ విషర్ సాయికుమార్ గారు అద్భుతంగా నటించారు. రాశిఖన్నా బెల్లం శ్రీదేవి పాత్రకు ప్రాణం పోసింది. రవికిషన్ గారు ఎంతో కమిట్ మెంట్ తో యాక్సిడెంట్ అయినా ఈ సినిమా చేశారు. సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు, ఫైట్స్, పెర్ ఫార్మెన్స్ పరంగా నెక్ట్స్ లెవల్ కు వెళ్లాడని అంటున్నాడు. ఈ సమ్మర్ లో కూల్ ఎంటర్ టైనర్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more