మహేష్ బాబు, సమంత, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి, యం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత పరల్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ U సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.
Also Read: ‘బ్రహ్మోత్సవం’ హైలెట్స్ ఏంటో తెలుసా?
కుటుంబ బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్ వంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. కానీ ‘బ్రహ్మోత్సవం’కు ‘సరైనోడు’ అడ్డుపడుతున్నాడని మహేష్ అభిమానులు నిర్మాత అల్లు అరవింద్ పై గరం గరం మీదున్నారు.
Also Read: ‘బ్రహ్మోత్సవం’ భామకు షాకిచ్చిన లిప్ లాక్
అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’ సినిమా ఇటీవలే విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మరిన్ని రోజులు వెయిట్ చేస్తే అనుకున్న రకంగా కలెక్షన్లు వస్తాయెమోనని నిర్మాత అల్లు అరవింద్ ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లను బ్లాక్ చేసి పెట్టారట. దీంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలకు అక్కడ థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిసింది.
Also Read: బ్రహ్మోత్సవం సినిమా రివ్యూ
దీంతో తమ అభిమాన హీరో సినిమా విడుదల కాకుండా థియేటర్ల కొరత కలిగించేందుకు కారణమైన ‘సరైనోడు’పై మహేష్ పై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజానిజాలున్నాయో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. కానీ ఇపుడేమి పెద్ద సినిమాలే లేవు కాబట్టి.. దాదాపు అన్ని చోట్ల ‘బ్రహ్మోత్సవం’ విడుదలవ్వడానికి అవకాశం వుంది. మరి ‘బ్రహ్మోత్సవం’కు ‘సరైనోడు’ అడ్డుపడతాడో లేక దారి ఇస్తాడో అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
ఇక ఈ సినిమాపై అభిమానులు పూర్తి నమ్మకంతో వున్నారు. ‘శ్రీమంతుడు’ను మించి ‘బ్రహ్మోత్సవం’ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ‘బ్రహ్మోత్సవం’ ఎలాంటి రికార్డుల క్రియేట్ చేయనుందో త్వరలోనే తెలియనుంది.
- Sandy
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more