మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు విడుదలకు ముందే 5/5 రేటింగ్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఉమైర్ సాంధు.. ఆ తర్వాత ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఇతని రివ్యూ రేటింగ్ ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. సర్దార్ తర్వాత ‘సరైనోడు’ సినిమాకు కూడా అదే స్థాయిలో రేటింగ్ ఇచ్చాడు. కానీ సరైనోడు కాస్త పర్వాలేదనిపించాడు. ఇపుడు తాజాగా మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాను చూసిన ఉమైర్ సాంధు తన రేటింగ్ ను ఇచ్చేసి, మహేష్ అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేసాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, కాజల్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రణీత, రేవతి, సత్యరాజ్, జయసుధ, సాయాజీ షిండే, నరేష్ వంటి ప్రధాన తారాగణం నటించారు.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ U సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ మరోసారి ఉమైర్ సాంధు తన రివ్యూను ప్రకటించేసాడు. అయితే ఈ సినిమాలో మహేష్ గ్లామర్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్ అని, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ బాగుందని చెప్పుకొచ్చాడు.
Also Read: ‘బ్రహ్మోత్సవం’ హైలెట్స్?
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అందరు నటీనటుల పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్... మహేష్ నటనకు ఎన్నో అవార్డులను తెచ్చిపెడుతుందని.. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని ‘బ్రహ్మోత్సవం’ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సినిమాకు ఉమైర్ సాంధు 5/5 రేటింగ్ ఇచ్చాడు.
ఈ రివ్యూ మరియు రేటింగ్ చూసి మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. గతంలో సర్దార్ కు ఇచ్చినట్లే 5/5 రేటింగ్ ఇచ్చాడు... మరి ఈ సినిమా ఎలా వుంటుందో ఏమోననే ఉత్కంఠ మొదలయ్యింది. మొత్తానికి ‘బ్రహ్మోత్సవం’ మొదటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది.
- Sandy
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more