మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం రేపు(మే 20) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఏ సినిమా విడుదలైన కూడా కేవలం నాలుగు షోలతో మాత్రమే కొనసాగేవి. విడుదల రోజున ప్రీమియర్ షో లు వేస్తుంటారు. కానీ ‘బ్రహ్మోత్సవం’కు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
Also Read: రేటింగ్ చూసి భయపడుతున్న ఫ్యాన్స్
తెలంగాణ ప్రభుత్వం ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి 5 ఆటలు ఉత్తర్వులు ప్రకటించింది. బ్రహ్మోత్సవం విడుదలయ్యే ప్రతి థియేటర్లలో ఐదు షోలు వేయనున్నారు. ఇది కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణా రాష్ట్రం అంతట కూడా ఇది అమలు కానుంది. ఈ ఉత్తర్వులుతో బ్రహ్మోత్సవం యూనిట్ చాలా సంతోషంగా వుంది.
తమ సినిమా విడుదలవుతున్న రోజునే 5 షోలు ప్రదర్శించడం సినిమా ఇండస్ట్రీకి మంచి పరిణామమని, ఈ సంధర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చిత్ర నిర్మాత పివిపి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఒకరోజున 5 షోలు వేయడం వల్ల భారీ కలెక్షన్ల రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు 5 షోల ఆఫర్ ఇస్తే.. ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగనుందో మరికొద్ది గంటల్లోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more