యంగ్ టైగర్ అభిమానులకు శుభవార్త | Janatha Garage Teaser Release Date

Janatha garage teaser release date

Janatha Garage Teaser Release Date, Janatha Garage Chennai Schedule Details, Janatha Garage Posters, Janatha Garage shooting updates, NTR Janatha Garage Movie updates, జనతా గ్యారేజ్, ఎన్టీఆర్, యంగ్ టైగర్, Janatha Garage stills, Janatha Garage working stills, Janatha Garage, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, NTR Movie Updates, NTR Movie Details, వార్తలు, రాజకీయాలు, ఆటలు, ఫోటోలు, NTR stills, NTR latest stills, NTR, Samantha hot stills, Samantha cleavage stills, Nithya menon latest stills

Janatha Garage Teaser Release Date: Young Tiger NTR Janatha Garage movie teaser will be release on 28 May. Koratala shiva director. Mytri Movie Makers Produce this film. Samantha, Nithya menon heroines.

యంగ్ టైగర్ అభిమానులకు శుభవార్త

Posted: 05/27/2016 11:32 AM IST
Janatha garage teaser release date

‘నాన్నకు ప్రేమతో’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 26వ చిత్రం ‘జనతా గ్యారేజ్’. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తమిళ, మలయాళం సినీతారలు కూడా ఈ పోస్టర్లకు ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రేపు(మే 28) స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లుగా తెలిసింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చెన్నై షెడ్యూల్ తర్వాత మళ్ళీ హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాట చిత్రీకరణ జరగనుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Samantha  Nithya Menon  

Other Articles