ఇదేం డాన్సు స్టైలిష్ స్టార్? | Allu Arjun Sneha Dance Video

Allu arjun sneha dance video

Allu Arjun Sneha Dance Video, Allu Arjun dance with Sneha, Allu Arjun Sangeeth Dance, Allu Arjun movies, Allu Arjun Sneha stills, Allu Arjun film updates, Allu Arjun stills

Allu Arjun Sneha Dance Video: Stylish star Allu Arjun dance with his wife Sneha reddy. This dance video popular in social media.

ఇదేం డాన్సు స్టైలిష్ స్టార్?

Posted: 05/27/2016 12:54 PM IST
Allu arjun sneha dance video

తెలుగులో స్టైలిష్ స్టార్ గా పేరుతెచ్చుకున్న అల్లు అర్జున్ డాన్సులకు మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టైలిష్ డాన్సులు చేయగల హీరోలలో టాప్ స్థానంలో బన్నీ వుంటాడు. మాములుగా సినిమాల్లోనే కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా బన్నీ డాన్సులు చేస్తుంటాడు.

అయితే బన్నీ తన ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన ఓ సంగీత్ పార్టీలో చాలా మూడీగా చిందులేసాడు. తన భార్య స్నేహాతో కలిసి బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ‘జుమ్మెకి రాత్ హై...’ పాటలో చాలా నిరసంగా డాన్సులు వేసాడు. ఏదో డాన్స్ రిహార్సల్స్ కు ప్రాక్టిస్ చేస్తున్నట్లుగా బన్నీ చేసిన ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఈ వీడియో చూసినవాళ్లంతా శ్రీజ సంగీత్ పార్టీలోది అని కొందరు, శ్రీజ సంగీత్ పార్టీలోనిది కాదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా బన్నీ డాన్స్ చూసినవాళ్లంతా కూడా ‘ఏంటి బన్నీ ఇలా చేసావు..’ అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో డాన్సులు ఇరగదీసే బన్నీ.. ఇలా సంగీత్ ఫంక్షన్లో చాలా నిరసంగా చేయడం చూసిన అభిమానులు కాస్త నిరాశ ఫీలవుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sneha  Sarrainodu  

Other Articles