Sunil jakkanna movie analysis

Sunil jakkanna movie analysis

sunil movie, sunil as jakkanna, sunil vs vamsy krishna, vamsy krishna direcor, sunil comedian, sunil next movie, sunil upcoming movie, sunil next movie, sunil comedy

Hero sunil jakkanna movie analysis. hero and as well as comedian sunil previous movies all are flops at boxoffice. he is expecting and hope for jakkanna movie hit.

ఇదైనా హిట్ ఇస్తుందా...?

Posted: 06/21/2016 02:00 PM IST
Sunil jakkanna movie analysis

కమెడియన్ గా కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే హీరోగా టర్న్ తీసుకున్న నటుడు సునీల్. కథానాయకుడిగా మారిన తరువాత ఒకటి రెండు సినిమాలతో పరవాలేదనిపించినా, తరువాత మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రొటీన్ క్యారెక్టర్లతో బోర్ కొట్టిస్తున్న ఈ భీమవరం బుల్లోడు సరైన సక్సెస్ కోసం చాలా సినిమాల నుంచి ఎదురు చూస్తున్నాడు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో కలిసి చేసిన కృష్ణాష్టమి సినిమా కూడా నిరాశపరచటంతో తన తర్వాతి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ప్రస్తుతం సునీల్, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో 'జక్కన్న' సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ మార్క్ కామెడీ కూడా బాగానే ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా మీద పాజిటివ్ టాక్ క్రియేట్ చేసిన రిజల్ట్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. రక్ష సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వంశీకృష్ణకు కూడా జక్కన్న సక్సెస్ చాలా కీలకంగా మారింది. మరి రాజమౌళి ముద్దు పేరుతో వస్తున్న ఈ సినిమా అయినా సునీల్ కెరీర్ ను గాడిలో పెడుతుందే లేదో తెలియాలంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comedian sunil  sunil comedy movies  sunil jakkanna movie  jakkanna  

Other Articles