three movies releasing in tollywood this week

Three movies releasing in tollywood this week

niharika movie, okamanasu movie release, oka manasu film tickets, this friday movies, friday movies in tollywood, rajadhiraja movie, sharwanand movie, naga sourya, nithya menon movie

three movies releasing in tollywood this week

బాక్సాఫీస్ కొల్లగొట్టే దమ్ముందా...?

Posted: 06/22/2016 11:16 AM IST
Three movies releasing in tollywood this week

సమ్మర్‌ సినిమా సందడి అయిపోయింది. ఇక రెయినీ సీజన్‌ సినిమా సందడి మొదలైంది. అయితే ఇప్పుడు సీజన్‌ తో సంబంధం లేకుండా సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు కాబట్టి ఈవారం కూడా ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి. గతవారం వచ్చిన జెంటిల్ మెన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈవారం విడదల కాబోతున్న సినిమాల్లో ఒకటి మెగా డాటర్‌ సినిమా 'ఒక మనసు' ఉండటం సినీ ప్రేక్షకుల్లో ఆత్రుతను పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ శుక్రవారం (జూన్ 24) మూడు సినిమాలు వరసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముందుగా నాగశౌర్యహీరోగా, మెగా తనయ నిహారిక హీరోయిన్‌ గా పరిచయమవుతున్న 'ఒక మనసు' సినిమా ఉంది. ఇప్పటికే ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ సినిమా హీరోయిన్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఇక వరుస హిట్లతో ఉన్న శర్వానంద్ మళ్లీ నిత్యామీనన్‌ తో కలిసి 'రాజాధిరాజా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక దర్శకుడు వరా చాలా గ్యాప్‌ తర్వాత 'కుందనపు బొమ్మ' సినిమాని రిలీజ్‌ చేస్తున్నాడు. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ హీరో సుధాకర్, కేటుగాడు ఫేం చాందిని హీరోయిన్ గా ఇందులో నటిస్తున్నారు.  

చిన్న బడ్జెట్ సినిమాలుగా బరిలోకి దిగుతున్న ఈ సినిమాల్లో ఏ సినిమాకి బాక్సాఫీసుని బద్దలు కొట్టే దమ్ముందో చూడాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajadhiraja movie  oka manasu movie  kundanapu bomma movie  sharwanand  nithya menon  niharika  

Other Articles